లైంగిక వేధింపుల కేసులో సంచలనం
దిశ, వెబ్డెస్క్: అమీన్పూర్ అనాథాశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అసలు ఆశ్రమానికి అనుమతులు లేనట్టు పోలీసులు గుర్తించారు. మొదటి రోజు నిందితులను కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఫోటో, వీడియోగ్రఫీ ద్వారా విచారణ మొదలు పెట్టారు. కాగా, లైంగిక వేధింపులతో ఇటీవల 14 ఏండ్ల మైనర్ ఆరోగ్య క్షీణించి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, మిగతా బాలికలపై కూడా లైంగిక దాడులు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో రేపు మరోసారి […]
దిశ, వెబ్డెస్క్: అమీన్పూర్ అనాథాశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అసలు ఆశ్రమానికి అనుమతులు లేనట్టు పోలీసులు గుర్తించారు. మొదటి రోజు నిందితులను కస్టడీలోకి తీసుకున్న అధికారులు ఫోటో, వీడియోగ్రఫీ ద్వారా విచారణ మొదలు పెట్టారు.
కాగా, లైంగిక వేధింపులతో ఇటీవల 14 ఏండ్ల మైనర్ ఆరోగ్య క్షీణించి మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే, మిగతా బాలికలపై కూడా లైంగిక దాడులు చేసినట్టు విచారణలో తేలింది. దీంతో రేపు మరోసారి నిందితులను పఠాన్ చెరు డీఎస్పీ కార్యాలయంలో విచారించనున్నారు. వీరితో పాటు ఆశ్రమంలోని బాలికలను కూడా వేరు వేరుగా విచారించాలని హై పవర్ కమిటీ నిర్ణయించింది.