రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఉత్తర్వులు
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో సాధారణ ఎన్నికలు, అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన పలు వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. మే 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. కొవిడ్ నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే […]
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ మున్సిపాలిటీల్లో సాధారణ ఎన్నికలు, అనివార్య కారణాల వల్ల ఖాళీలు ఏర్పడిన పలు వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల 30వ తేదీన ఎన్నికలు నిర్వహించనుంది. మే 3న ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు. కొవిడ్ నేపథ్యంలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించొద్దని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే గెలుపొందిన వారు రిటర్నింగ్ అధికారి చేతులమీదుగా నియామక పత్రాలను అందుకునేందుకు అభ్యర్థితో పాటు మరో ఇద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. కొవిడ్ నిబంధనలను అందరూ పాటించాలని ఆయన తెలిపారు. లేదంటే ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.