మర్డర్ కేస్: సహజీవనం చేసిన వ్యక్తి సజీవ దహనం చేశాడా..?

దిశ, ఆర్మూర్: మాక్లూరు మండలం ముల్లంగి (బి) గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దుండగులు దహనం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలు ఇదే మండలంలోని బొంకన్‌పల్లి గ్రామానికి చెందిన గద్దల రాణిగా (32)గా గుర్తించిన పోలీసులు హంతకుడు ఓ ఆటో డ్రైవర్ అని అనుమానిస్తున్నారు. ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తూ అనుమానంతో ఉసురు తీసినట్లు తెలుస్తున్నది. హంతకుడుగా భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. గత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముల్లంగి […]

Update: 2021-10-07 11:53 GMT

దిశ, ఆర్మూర్: మాక్లూరు మండలం ముల్లంగి (బి) గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దుండగులు దహనం చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మృతురాలు ఇదే మండలంలోని బొంకన్‌పల్లి గ్రామానికి చెందిన గద్దల రాణిగా (32)గా గుర్తించిన పోలీసులు హంతకుడు ఓ ఆటో డ్రైవర్ అని అనుమానిస్తున్నారు. ఇరవై ఏళ్లుగా సహజీవనం చేస్తూ అనుమానంతో ఉసురు తీసినట్లు తెలుస్తున్నది. హంతకుడుగా భావిస్తున్న వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

గత మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముల్లంగి (బి) శివారులో గుర్తు తెలియని మహిళను దహనం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన రహదారిపైనే మహిళను దహనం చేయడంతో పరిసర గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. బుధవారం తెల్లవారు జామున మృతదేహం దహనమవుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాళ్లకు ఉన్న మెట్టెల ఆధారంగా మహిళగా గుర్తించిన పోలీసులు గుర్తు తెలియని డెడ్‌బాడీగానే కేసు నమోదు చేశారు.

ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఇదే మండలంలోని బొంకన్ పల్లికి చెందిన గద్దల రాణి అదృశ్యమైనట్లు ఆమె కుటుంబీకుల నుంచి మాక్లూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఈ కోణంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సహజీవనం చేస్తున్న వ్యక్తే హతమార్చి ఉంటాడని భావిస్తున్నట్లు తెలిసింది.

బొంకన్‌పల్లికి చెందిన గద్దల రాణితో జిల్లా కేంద్రంలోని శివాజీనగర్‌లో నివాసం ఉండే గణేశ్ అనే ఆటో డ్రైవర్ కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. వీరికి ఓ కూతురు ఉన్నది. ఇటీవల రాణి మరొకరితో అక్రమ సంబంధం సాగిస్తున్నట్లు అనుమానించిన గణేశ్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడన్న భావన వ్యక్తమవుతున్నది. గణేశ్ పాత నేరస్తుడని తెలిసింది. గణేశ్ నిజామాబాద్-గొట్టుముక్కల రూట్‌లో ఆటో డ్రైవర్‌గా సుపరిచితుడు. కొంత కాలంగా ఈ రూట్‌లో ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్న గణేశ్ రాణితో పరిచయం పెంచుకొని సహజీవనం సాగించినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది. చివరకు అనుమానంతో ఆమె ఉసురు తీసినట్లు తెలుస్తున్నది. పాత నేరస్తుడైన గణేశ్ పై పలు ఠాణాల్లో చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకొని విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉన్నది.

ఇంకా నిర్ధారణ కాలేదు..

ముల్లంగి (బి) శివారులో దహనమై లభించిన మహిళ కేసు దర్యాప్తు వేగవంతం చేశాం. బొంకన్‌పల్లికి చెందిన మహిళ మిస్ అయినట్టు ఫిర్యాదు అందడంతో హత్యకు గురైన వ్యక్తి ఆమెనా కాదా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా నిర్ధారణ అవుతుంది. అదృశ్యమైన మహిళ కూతురును విచారణ చేశాం. మా అమ్మ ఇలాగే ఉంటుంది.. కాళ్లకు ఇలాంటి మెట్టెలే పెట్టుకున్నది అని మాత్రమే చెబుతున్నది. -నిజామాబాద్ నార్త్ సీఐ గురునాథ్

Tags:    

Similar News