కరోనా హెల్ప్ లైన్ ఆరంభించిన కేశినేని నాని

దిశ, ఏపీ బ్యూరో: కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ వాసులకు ఏ అవసరం ఉన్నా తాను, తన బృందం నిరంతరం ఫోన్‌లో అందుబాటులో ఉంటామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తమ సేవలు అవసరమైనవారు 91002 63636, […]

Update: 2020-07-25 21:39 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా నియంత్రణకు ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని ఆయన సూచించారు. అత్యవసరమైతే మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ వాసులకు ఏ అవసరం ఉన్నా తాను, తన బృందం నిరంతరం ఫోన్‌లో అందుబాటులో ఉంటామని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తమ సేవలు అవసరమైనవారు 91002 63636, 90138 69929, 91001 66868, 94945 67777, 90594 76789, 70324 46767 నెంబర్లకు ఫోన్‌ చేయాలని కేశినేని నాని సూచించారు.

Tags:    

Similar News