Covid-19 vaccine wastage : ఆ రాష్ట్రాల్లో టీకా వృథా లేదు.. కేంద్రం కీలక ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, వ్యాక్సినేషన్‌లో భాగంగా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల వృథా పెద్ద సమస్యగా మారింది. వ్యాక్సిన్లను వృథా చేయకుండా కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యాక్సిన్ల వినియోగంలో కేంద్రం ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం.. కేరళ, బెంగాల్ వ్యాక్సిన్లను వృథా చేయకుండా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది. మే నెలలో కేరళ తమకిచ్చిన కోటా కంటే అధికంగా 1.10 లక్షల డోసులను ప్రజలకు వేసింది. బెంగాల్‌లో 1.61 లక్షల […]

Update: 2021-06-10 08:15 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే, వ్యాక్సినేషన్‌లో భాగంగా చాలా రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల వృథా పెద్ద సమస్యగా మారింది. వ్యాక్సిన్లను వృథా చేయకుండా కొన్ని రాష్ట్రాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. వ్యాక్సిన్ల వినియోగంలో కేంద్రం ప్రకటించిన తాజా లెక్కల ప్రకారం.. కేరళ, బెంగాల్ వ్యాక్సిన్లను వృథా చేయకుండా వినియోగించుకుంటున్నట్టు తెలిపింది.

మే నెలలో కేరళ తమకిచ్చిన కోటా కంటే అధికంగా 1.10 లక్షల డోసులను ప్రజలకు వేసింది. బెంగాల్‌లో 1.61 లక్షల డోసులను అధికంగా అందించింది. నిజానికి వ్యాక్సిన్‌ వయల్‌లో వృథాను పరిగణనలోకి తీసుకుంటే పది డోసులు ఉంటాయి. అంటే సాధారణంగా ఒక వయల్‌ నుంచి 8 నుంచి 9 డోసులు ఇవ్వగలరు. అయితే కేరళ, బెంగాల్ రాష్ట్రాలు మాత్రం ఈ వృథాను కూడా వినియోగించుకుంటున్నాయి. అలా ఒక వయల్‌ నుంచి పూర్తిగా 10 డోసులు ఇవ్వగలుగుతున్నాయి.

అయితే ఆయా రాష్ట్రాల్లో అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది పనితీరు, నర్సులే వ్యాక్సిన్ వృథా కాకపోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోడీ.. కేరళ వైద్య సిబ్బంది పనితీరుపై ప్రశంసలు కురిపించారు. ఇక కేంద్రం లెక్కల ప్రకారం.. జార్ఖండ్‌లో అత్యధికంగా వ్యాక్సిన్ వృథా అయింది. జార్ఖండ్‌లో వ్యాక్సిన్‌ వృథా 33.95శాతం ఉండగా, ఛత్తీస్‌గఢ్‌లో 15.79 శాతం, మధ్యప్రదేశ్‌లో 7.35, పంజాబ్‌లో 7.08 శాతం డోసులు వృథాగా పోతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌లోనూ వ్యాక్సిన్ వృథా 3 శాతం కంటే ఎక్కువగానే ఉంది.

Tags:    

Similar News