అగ్నిప్రమాద ఘటనపై కేసీఆర్ దిగ్భ్రాంతి
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆయన అధికారులను అడిగి ఆరా తీశారు. అక్కడ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. […]
దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం అగ్ని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలపై ఆయన అధికారులను అడిగి ఆరా తీశారు. అక్కడ పరిస్థితిపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించాలని ఆదేశించారు.
కాగా, నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్న విషయం తెలిసిందే.