ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదు: సీఎం కేసీఆర్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ముగిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక, పార్టీ ప్లీనరీ సమావేశం, పార్టీ అధ్యక్షుడి ఎంపికతోపాటు పలు అంశాలపై వారితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ‘ఈసారి మనం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ఈలోపు అన్ని […]
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశం ముగిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక, పార్టీ ప్లీనరీ సమావేశం, పార్టీ అధ్యక్షుడి ఎంపికతోపాటు పలు అంశాలపై వారితో సీఎం కేసీఆర్ చర్చించారు. ఈ సందర్భంగా వారికి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ‘ఈసారి మనం ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదు. మనం చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా రెండేళ్ల సమయం ఉంది.. ఈలోపు అన్ని పనులు చేసుకుందాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని ఎక్కువ స్థానాలు గెలిచేలా పనిచేయాలి’ అని వారికి కేసీఆర్ సూచించినట్లు సమాచారం.
అదేవిధంగా హుజూరాబాద్ లో ఈనెల 26 లేదా 27న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారని, ఆ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారని, ఆ విషయంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం.