పీఆర్సీ, నిరుద్యోగ భృతిపై కేసీఆర్ కీలక ప్రకటన..
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, వారు సంతోషించే విధంగా మంచి పిట్‌మెంట్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, మన రాష్ట్రంలో విద్యార్థులకు, టీచర్లకు కూడా పాజిటివ్ వస్తోందని, వాటిని నడిపించాలా వద్దా అనేదానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ పై అంశాలను తెలిపారు. రైతులు పంటలు అమ్ముకోడానికి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, వారు సంతోషించే విధంగా మంచి పిట్‌మెంట్ ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని, మన రాష్ట్రంలో విద్యార్థులకు, టీచర్లకు కూడా పాజిటివ్ వస్తోందని, వాటిని నడిపించాలా వద్దా అనేదానిపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా కేసీఆర్ పై అంశాలను తెలిపారు. రైతులు పంటలు అమ్ముకోడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు యథావిధిగా కొనసాగుతాయని, ఎన్ని నెలకొల్పాలి, ఏయే గ్రామాల్లో పెట్టాలో వ్యవసాయ మంత్రి నిర్ణయిస్తారని అన్నారు. పెద్దపల్లి జిల్లాలో న్యాయవాదుల దంపతుల హత్య కేసు దర్యాప్తును ఎట్టిపరిస్థితుల్లో సీబీఐకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. ప్రస్తుతం ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, నిందితులు ఎంతటివారైనా కఠినంగా శిక్షిస్తామన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసుకు ప్రత్యేక గుర్తింపు, సమర్ధవంతమైన శాఖ అనే పేరు ఉన్నదని, నిష్పాక్షికంగా విచారణ జరుగుతున్నందున సీబీఐకు అప్పగించాల్సిన అవసరమే లేదన్నారు.
కరోనా కారణంగా రాష్ట్రానికి సుమారు లక్ష కోట్ల రూపాయల నష్టం వచ్చిందని, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకే కోత పెట్టాల్సిన పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఎలా ఇస్తామని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చాం.. కాబట్టి తప్పకుండా అమలు చేస్తామని, వెనక్కి వెళ్ళబోమని స్పష్టం చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలు ఎలా ఉన్నా రాష్ట్రం మాత్రం రైతుల సౌకర్యం కోసం మార్కెట్లు యధావిధిగా కొనసాగుతాయని, కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని ఇప్పటి పంటలను కొనడానికి గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలను నెలకొల్పుతామని సీఎం స్పష్టం చేశారు.