‘కేసీఆర్‌ది చేతకాని ప్రభుత్వం’

దిశ, మణుగూరు : పోడు భూములకు పట్టాలు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు. సోమవారం న్యూ డెమోక్రసీ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ అశ్వాపురం, మొండికుంట గ్రామలలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హరితహారం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను అక్రమించుకుంటుందని మండిపడ్డారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం ఎంతో దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ […]

Update: 2021-08-16 07:15 GMT

దిశ, మణుగూరు : పోడు భూములకు పట్టాలు ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి మోర రవి అన్నారు. సోమవారం న్యూ డెమోక్రసీ నాయకుల అక్రమ అరెస్టును నిరసిస్తూ అశ్వాపురం, మొండికుంట గ్రామలలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హరితహారం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూములను అక్రమించుకుంటుందని మండిపడ్డారు. పోడు సాగుదారులపై ఫారెస్ట్ అధికారులు దాడులు చేయడం ఎంతో దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడుభూములకు పట్టాలివ్వలన్నారు.

ఆదివాసుల దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని పోడుభూముల సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటివరకు పోడు భూముల సమస్య గురించి ఒక్కసారి కూడా నోరు మెదపలేదన్నారు. ఆదివాసుల పోడు భూములకోసం ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముందు ఆందోళన చేయడానికి వెళుతున్న న్యూడెమోక్రసీ నాయకులను అరెస్టులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అన్నారు. నాయకుల అరెస్టులను న్యూడెమోక్రసీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆదివాసీలు సాగుచేసుకుంటున్న పోడుభూముల సమస్యను సామరస్యంగా పరిష్కరించి పోడు సాగుదారులందరికి హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోడుభూముల పోరాటం మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు లింగాల వెంకన్న, టి.సాయి, ఎల్.శివ, ఎం.సైదులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News