బీజేపొళ్లను బకరా చేసిన కేసీఆర్.. ఇదే ప్రూఫ్ !
దిశ, వెబ్‌డెస్క్: పొట్టోని జుట్టును పొడుగోడు కొడితే పొడుగోని జుట్టును పోశమ్మ కొడుతదన్న కేసీఆర్ మాటలను ఆయనకే వినిపించిన బీజేపీ నేతలు.. తీరా కొసరెళ్లక ముందే బకరా అయ్యారన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఆలు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణలో హైపర్ సృష్టించిన కాషాయ శ్రేణులు కేసీఆర్ విసిరిన చక్రంలో చిక్కుకొని గింగిరాలు తిరుగుతున్నారన్న పాయింట్ పాలిటిక్స్‌లో చర్చకు దారి తీస్తుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఇక తమకు […]
దిశ, వెబ్‌డెస్క్: పొట్టోని జుట్టును పొడుగోడు కొడితే పొడుగోని జుట్టును పోశమ్మ కొడుతదన్న కేసీఆర్ మాటలను ఆయనకే వినిపించిన బీజేపీ నేతలు.. తీరా కొసరెళ్లక ముందే బకరా అయ్యారన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిళ్లలో చక్కర్లు కొడుతున్నాయి. ఆలు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా తెలంగాణలో హైపర్ సృష్టించిన కాషాయ శ్రేణులు కేసీఆర్ విసిరిన చక్రంలో చిక్కుకొని గింగిరాలు తిరుగుతున్నారన్న పాయింట్ పాలిటిక్స్‌లో చర్చకు దారి తీస్తుంది. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయంతో ఇక తమకు ఎదురే లేదని, కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్న కమలనాథులు.. ఢిల్లీలో కేసీఆర్ వ్యూహాలను చూసి నీళ్లు నములుతున్నారని.. నిన్నటి దాకా హైదరాబాద్ వచ్చి తిట్టిపోయిన కేంద్రమంత్రులను తన బుట్టలో వేసుకొన్న కేసీఆర్.. రాష్ట్ర బీజేపీ నేతలను బకరా చేశారన్న అభిప్రాయాలు రాజకీయ శ్రేణుల్లో వినిపించడం గమనార్హం.
దుబ్బాక బైపోల్ గెలుపుతో బండిని హండ్రెడ్ స్పీడుతో నడిపిన సంజయ్ గ్రేటర్ ఎన్నికల్లో అదే సత్తా చాటి అదేరేంజ్‌లో వలసలను ప్రోత్సహించారు. నిన్న దుబ్బాకలో బావను ఓడించాం, ఇవాళ గ్రేటర్‌లో బామ్మర్థిని ఓడించాం, రేపు గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడిస్తామని హైలైట్ స్పీచులు ఇచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. టీఆర్ఎస్ అంటేనే ఒంటికాలిపై లేచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవితపై తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించిన సంజయ్ కేసీఆర్ ఢిల్లీ టూర్‌తో అయోమయంలో చిక్కుకుపోయారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేయాల్సిన కృషి చేస్తూ ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను తీసుకువచ్చే క్రమంలో ఇలా ఢిల్లీ పెద్దలు వ్యవహరించిన విధానంతో కాసింత నొచ్చుకున్నట్లు సమాచారం.
గతంలోనూ లక్ష్మణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు తెలంగాణ పథకాలను పొగడటంతో ఇబ్బంది పడ్డ నేతలు… ఇక కేసీఆర్ చేసిన ఢిల్లీ టూర్‌తో అసలు ఏం జరుగుతుందనే చర్చలో పడ్డారు. పార్టీ బలోపేతానికి ఉన్నకాడికి ఎఫర్ట్ పెట్టి పనిచేస్తుంటే నోటికాడికి వచ్చిన ముద్దను చెడగొట్టినట్లుగా తమ హైకమాండ్ నేతలు విధానం ఉందని లోలోపల రగిలిపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ పార్టీ పెద్దలను పల్లెత్తు మాట అనలేక ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం గానీ, కేసీఆర్‌ను విమర్శలు చేయలేక పోతున్నారు. అసలు కేసీఆర్ పని అయిపోయింది ఢిల్లీ వెళ్తే ఆయన్ను ఎవరూ పట్టించుకోరని ఇక్కడి లోకల్ లీడర్లు కామెంట్లు చేసిన 10రోజుల్లోపే ప్రధాని మోడీతో పాటు అంతే బలసారి అయిన అమిత్ షాను కలిసి చర్చలు జరపడాన్ని బీజేపీ నేతలకు మింగుడు పడటం లేదన్న ప్రచారం జరుగుతోంది.
ఫైర్ బ్రాండ్‌లు బండి సంజయ్ నుంచి మొదలు ధర్మపురి అరవింద్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు నిన్న సొంతగూటికి చేరిన విజయశాంతి సైతం కేసీఆర్‌ను తిట్టిన తిట్టు తిట్టకుండా బీజేపీకి హైప్ తెచ్చి ఇంకొంతమంది టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలను తీసుకువచ్చే క్రమంలో కేసీఆర్ వేసిన స్కెచ్‌లో ఢిల్లీ నేతలు సైతం చిక్కుకున్నారన్న విశ్లేషణలు జరుగుతున్నాయి. తనపై ఎదురుదాడికి దిగితే వాళ్లతోటే వాళ్ల కంట్లో పొడిచే విద్య సీఎం కేసీఆర్‌కు తెలుసని, ఇప్పుడు లాంటి స్ట్రాటజీని ఉపయోగించే ప్రధాని మోడీ, అమిత్ షాతో మనం మనం భాయ్ భాయ్ అని చెప్పొచ్చారని, ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతలు ఎలాంటి అంశాలను తెరమీదకు తెచ్చినా ఇతర పార్టీ నేతల్లో లోలోపల టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనన్న అభిప్రాయాలు వస్తాయని చెప్పుకుంటున్నారు.