శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్… ఎట్టకేలకు నర్సులకు కొలువులు
దిశ, తెలంగాణ బ్యూరో : దాదాపు నాలుగేళ్ళ ఎదురుచూపుల తర్వాత స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ పూర్తయింది. అర్హులైనవారందరికీ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కొలువుల్లో చేరడమే తరువాయి. వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య శాఖ విభాగాల్లో మొత్తం 2,408 మంది ఎంపిక పూర్తయింది. పోస్టు ద్వారా నియామక పత్రాలు అందుకునే ప్రక్రియ మొదలైంది. డ్యూటీలో చేరడమే తరువాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 3,311 పోస్టుల్ని భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 […]
దిశ, తెలంగాణ బ్యూరో : దాదాపు నాలుగేళ్ళ ఎదురుచూపుల తర్వాత స్టాఫ్ నర్సుల నియామక ప్రక్రియ పూర్తయింది. అర్హులైనవారందరికీ నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక కొలువుల్లో చేరడమే తరువాయి. వైద్య విధాన పరిషత్, ప్రజారోగ్య శాఖ విభాగాల్లో మొత్తం 2,408 మంది ఎంపిక పూర్తయింది. పోస్టు ద్వారా నియామక పత్రాలు అందుకునే ప్రక్రియ మొదలైంది. డ్యూటీలో చేరడమే తరువాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు 3,311 పోస్టుల్ని భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2017 నవంబరులో నోటిఫికేషన్ జారీ చేయగా నిబంధనల్లో వెయిటేజీ మార్కుల విషయంలో కొద్దిమంది అభ్యర్థులు అప్పట్లో కోర్టుకెక్కారు.
చివరకు గతేడాది సెప్టెంబరులో ఉత్తర్వులు వెలువడడంతో నియామక ప్రక్రియకు మార్గం సుగమం అయింది. మొత్తం 3,311 స్టాఫ్ నర్సు పోస్టులకు వేలాది మంది పోటీపడినా చివరకు 2,418 మంది మాత్రమే అర్హత సాధించారు. ఇంకా 893 పోస్టులు ఖాళీగానే ఉండిపోయాయి. సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ లాంటి ప్రక్రియలన్నీ పూర్తయ్యి చివరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందాయి. మొత్తం అర్హత సాధించిన 2,418 పోస్టుల్లో 803 మాత్రం వైద్య విధాన పరిషత్ పరిధిలో ఉండగా మిగిలినవన్నీ ప్రజారోగ్య శాఖ పరిధిలో ఉన్నాయి. ఒక్కరొక్కరుగా నియామక పత్రాలను పోస్టు ద్వారా అందుకుంటున్నారు. డ్యూటీలో చేరడమే తరువాయి.