దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ఖరారు
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అప్పటి నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీశ్‌రెడ్డికి టికెట్ దక్కడం ఖాయమని ప్రచారం జరగ్గా.. పార్టీ అధిష్ఠానం చివరికి రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు […]
దిశ, వెబ్‌డెస్క్: దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థిని టీఆర్ఎస్ పార్టీ ఖరారు చేసింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కొద్దిరోజుల క్రితం ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. అప్పటి నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత లేదా కుమారుడు సతీశ్‌రెడ్డికి టికెట్ దక్కడం ఖాయమని ప్రచారం జరగ్గా.. పార్టీ అధిష్ఠానం చివరికి రామలింగారెడ్డి భార్య సుజాత పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అటు బీజేపీ నుంచి రఘునందన్‌రావు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేయగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేరును ప్రకటించలేదు.
Read Also..