నిజామాబాద్‌లో కవిత ఘన విజయం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించింది. మొదటి రౌండ్‌లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలిపు ఖరారు కాగా, మొత్తం రెండు రౌండ్లలో భారీ ఓట్లు పొందింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 728, బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ డిపాజిటివ్ కూడా […]
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించింది. మొదటి రౌండ్‌లోనే టీఆర్ఎస్ అభ్యర్థి కవిత గెలిపు ఖరారు కాగా, మొత్తం రెండు రౌండ్లలో భారీ ఓట్లు పొందింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 728, బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణకు 56, కాంగ్రెస్ అభ్యర్థి సుభాష్ రెడ్డికి 29 ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు తమ డిపాజిటివ్ కూడా కోల్పోయారు. ఇందులో ఏడు ఓట్లు తిరస్కరించగా, ఒక ఓటును పరిగణలోకి తీసుకోలేదు. కాగా ఇందూర్‌లోని ప్రభుత్వ పాల్‌టెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు రెండు రౌండ్లు కౌంటింగ్ చేయాల్సుండగా, మొదటి రౌండ్‌లోనే 531 ఓట్లతో కవిత విజయం ఖారారైంది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పరిశీలకులు వీర బ్రహ్మయ్య కౌంటింగ్ సరళిని పరిశీలించారు.