మా చెల్లెల్ని గెలిపించండి
దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ ఎంపీ కవితను భారీ స్థాయి మెజారిటీతో గెలిపించాలని ప్రజా ప్రతినిధులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ అన్ని ఎన్నికల్లో గెలుపును ఇచ్చినట్లుగానే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కవితను గెలిపించి ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి పంపాలని కోరారు. రెండు దశాబ్దాల క్రితం […]
దిశ, తెలంగాణ బ్యూరో: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ ఎంపీ కవితను భారీ స్థాయి మెజారిటీతో గెలిపించాలని ప్రజా ప్రతినిధులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో హైదరాబాద్ నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ అన్ని ఎన్నికల్లో గెలుపును ఇచ్చినట్లుగానే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కవితను గెలిపించి ఎమ్మెల్సీగా శాసనమండలిలోకి పంపాలని కోరారు.
రెండు దశాబ్దాల క్రితం నిజామాబాద్ జిల్లాలోని మోతె గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక ద్వారా టీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచిన ఈ జిల్లా ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. గడచిన ఆరేండ్లుగా రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలతో యావత్తు దేశ దృష్టిని తెలంగాణ ఆకర్షించగలిగిందని గుర్తుచేశారు. ఒకవైపు సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తూనే మరోవైపు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి కార్యక్రమాలను అమలుచేస్తోందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు పునరుజ్జీవన కార్యక్రమం ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిందని, కాలువల ఆధునికీకరణతో నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా త్వరలోనే నీళ్లు వస్తాయని కేటీఆర్ వివరించారు.
ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కవితను గెలిపించి టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపించాలని, అందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా మద్దతు పలకాలని కేటీఆర్ కోరారు. రైతు సంక్షేమం కోసం అవసరమైతే దేవునితో పోరాడుతాం అన్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి కోసం ఓటు వేయాలని కోరారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ప్రత్యేక నిధుల విషయంలో ఉన్న సమస్యలను ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, ఇందుకు సంబంధించి ఒక పరిష్కారం సూచిస్తుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పనితీరుని అర్థం చేసుకొని, రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట్ల కవితను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆశీర్వాదంతో రానున్న ఎన్నికల్లో కవిత ఎమ్మెల్సీగా ఎన్నికైన వస్తుందన్న నమ్మకం తనకు ఉన్నదని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.