హుజూరాబాద్ ఉప ఎన్నికపై కవిత సంచలన వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు, పార్టీ బలానికి రిఫరెండం కాదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకుంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచారని, దీన్ని బీజేపీ రిఫరెండంగా భావిస్తుందా? అని ప్రశ్నించారు. నిజంగా బీజేపీ అలా భావిస్తే.. అది ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతుందన్నారు. టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పట్ల […]

Update: 2021-10-14 04:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితం టీఆర్ఎస్ ప్రభుత్వ పని తీరుకు, పార్టీ బలానికి రిఫరెండం కాదని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు. ఒకవేళ అదే ప్రామాణికంగా తీసుకుంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భారీ మెజార్టీతో గెలిచారని, దీన్ని బీజేపీ రిఫరెండంగా భావిస్తుందా? అని ప్రశ్నించారు. నిజంగా బీజేపీ అలా భావిస్తే.. అది ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారుతుందన్నారు. టీఆర్ఎస్, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన పట్ల ప్రజలు విశ్వాసంతో ఉన్నారని, తప్పకుండా హుజూరాబాద్‌లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాత్రమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణ ఓటర్లు తెలివైనవారని, హుజూరాబాద్ అసెంబ్లీకి ఇప్పుడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందనేది అక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. ఎవరివైపు ఉండాలనే దానిపై కూడా వారికి క్లారిటీ ఉందన్నారు.

Tags:    

Similar News