‘కత్తి’కి రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు..

దిశ, వెబ్ డెస్క్: హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేసిన కేసులో సినీ క్రిటిక్, డైరక్టర్ కత్తి మహేశ్‌ను శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గత కొంతకాలంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు కరోనా ప్రియుడు’ అని కొన్ని నెలల కిందట ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అసభ్యకర పోస్ట్‌లు చేశారు. వీటిపై హిందూ సంఘాలు […]

Update: 2020-08-14 06:09 GMT

దిశ, వెబ్ డెస్క్: హిందూవుల మనోభావాలు దెబ్బతినేలా కామెంట్స్ చేసిన కేసులో సినీ క్రిటిక్, డైరక్టర్ కత్తి మహేశ్‌ను శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన గత కొంతకాలంగా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా, హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడిపై సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘శ్రీరాముడు కరోనా ప్రియుడు’ అని కొన్ని నెలల కిందట ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో అసభ్యకర పోస్ట్‌లు చేశారు. వీటిపై హిందూ సంఘాలు భగ్గమన్నాయి. తమ మనోభావాలు కించపరిచేలా పోస్టులు చేసిన ఆయన పై చర్యలు తీసుకోవాలని పలు పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టారు.

దీంతో ఇవాళ కత్తి మహేశ్‌ను సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా ఆయనకు ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు కత్తి మహేశ్‌కు రిమాండ్ విధించింది. అంతకుముందు పోలీసులు కత్తి మహేష్‌ను పలుమార్లు విచారించినట్లు తెలుస్తోంది.

గత కొంతకాలంగా కత్తి మహేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. గతంలో హీరో పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. అలా కొద్దిరోజులు వారి మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత, సినిమా చూసి వస్తుండగా కొందరు ఆయన పై దాడికి కూడా పాల్పడ్డారు.

కాగా, కత్తి మహేశ్ హృదయ కాలేయం, నేనే రాజు నేనే మంత్రి, కొబ్బరి మట్టతో పాటు పలు సినిమాల్లో సైడ్ రోల్స్ చేశారు. పెసరట్టు సినిమాకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. బుల్లితెర షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ వన్‌లో పార్టిసిపేట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.

Tags:    

Similar News