డ్రోన్ నిఘా నీడలో కంటైన్‌మెంట్ జోన్లు
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసు శాఖ, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్ జోన్లుగా విభజించింది. క్లస్టర్ జోన్లలో పరిస్థితుల పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు నిజామాబాద్ సీపీ కార్తికేయ తెలిపారు. జిల్లాలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు కంట్రోల్ ద్వారా నిఘా కొనసాగిస్తున్నామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన 74 మందిపై కేసులు నమోదు చేశామని, 2,333 […]
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో 53 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పోలీసు శాఖ, అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్‌మెంట్ క్లస్టర్ జోన్లుగా విభజించింది. క్లస్టర్ జోన్లలో పరిస్థితుల పర్యవేక్షణ కోసం డ్రోన్ కెమెరాలు వినియోగిస్తున్నట్లు నిజామాబాద్ సీపీ కార్తికేయ తెలిపారు. జిల్లాలో 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసు కంట్రోల్ ద్వారా నిఘా కొనసాగిస్తున్నామన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమించిన 74 మందిపై కేసులు నమోదు చేశామని, 2,333 వాహనాలను సీజ్ చేశామని, లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని సీపీ స్పష్టం చేశారు.
Tags: Nizamabad,corona,continement area, drone