కర్ణాటకలోనూ డబుల్ డెక్కర్ బస్సులు
దిశ, ఫీచర్స్ : హైదరాబాద్‌లో ఒకప్పుడు నడిచిన డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కర్ణాటకలోని మైసూరు సిటీలోనూ ఈ తరహా బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. చారిత్రక నగరమైన మైసూరులో సందర్శకులను పలు ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. సిటీ నుంచి మైసూరు ప్యాలెస్, చాముండేశ్వరి దేవాలయం, కరాంజి సరస్సు వరకు వెళ్లేలా కర్ణాటక స్టే్ట్ టూరిజం డిపార్ట్‌మెంట్(KSTDC) ఈ డబుల్ డెక్కర్ […]
దిశ, ఫీచర్స్ : హైదరాబాద్‌లో ఒకప్పుడు నడిచిన డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ తీసుకొచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా కర్ణాటకలోని మైసూరు సిటీలోనూ ఈ తరహా బస్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. చారిత్రక నగరమైన మైసూరులో సందర్శకులను పలు ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి తీసుకురానున్నారు. సిటీ నుంచి మైసూరు ప్యాలెస్, చాముండేశ్వరి దేవాలయం, కరాంజి సరస్సు వరకు వెళ్లేలా కర్ణాటక స్టే్ట్ టూరిజం డిపార్ట్‌మెంట్(KSTDC) ఈ డబుల్ డెక్కర్ బస్సుల రూట్లను ప్లాన్ చేసింది. 15 ఫీట్ల ఎత్తుండే ఈ డబుల్ డెక్కర్ బస్సు టాప్‌లో ఓపెన్ రూఫ్ ద్వారా ప్యాసింజర్లు నగరాన్ని వీక్షించొచ్చు. వీటి ద్వారా పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని అధికారులు భావిస్తున్నారు.
మైసూరు ర్యాడిసన్ బ్లూ స్టాప్ నుంచి ‘డబుల్ డెక్కర్ అంబారీ’ బస్సును ఇటీవల రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి సీపీ యోగేశ్వర్ ప్రారంభించారు. అటవీ, ఎలక్ట్రిసిటీ శాఖల సహకారంతోనే ఈ బస్సులు ఇంత త్వరగా అందుబాటులోకి వచ్చాయని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. బస్సులో ఒక ప్యాసింజర్‌కు టికెట్ ధర రూ.250గా నిర్ణయించారు. మైసూరులోని హోటల్ మయూర నుంచి స్టార్ట్ అయ్యే బస్సు సర్వీస్ కుక్కరహల్లి సరస్సు, యూనివర్సిటీ ఆఫ్ మైసూరు, ఫోల్క్‌లోర్ మ్యూజియం, రామస్వామి సర్కిల్, మైసూరు జూ, కరంజి సరస్సు, సంగోలి రాయణ సర్కిల్, చాముండి విహార్ స్టేడియం, సెయింట్ ఫిలొమెన చర్చ్, బన్నిమంటప్ ప్రదేశాల మీదుగా తిరిగి స్టార్టింగ్ పాయింట్ వద్దకు చేరుకుంటుంది.