శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఆత్మహత్య
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిక్‌మంగళూరు దగ్గర రైల్వేట్రాక్‌పై ధర్మేగౌడ మృతదేహం లభించింది. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోమవారం సాయంత్రం ఆయన ఒంటరిగా కారులో వెళ్లిన ఆయన.. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. చిక్‌మంగళూరు జిల్లా మంకెనహళ్లి […]
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిక్‌మంగళూరు దగ్గర రైల్వేట్రాక్‌పై ధర్మేగౌడ మృతదేహం లభించింది. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సోమవారం సాయంత్రం ఆయన ఒంటరిగా కారులో వెళ్లిన ఆయన.. రాత్రి అయినా రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా.. చిక్‌మంగళూరు జిల్లా మంకెనహళ్లి సమీపంలోని గుణసాగర్ వద్ద రైల్వేట్రాక్‌పై ధర్మేగౌడ మృతదేహం లభ్యమైంది. డిప్యూటీ చైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ నెల 15వ తేదీన కర్ణాటక మండలిలో రభస చోటు చేసుకుంది. ధర్మేగౌడను కాంగ్రెస్ సభ్యులు సీటులో నుంచి లాగేశారు. మండలి ఘటనతో ధర్మేగౌడ తీవ్ర మసస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.