కర్నాటక ముఖ్యమంత్రికి రెండోసారి కరోనా

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం.. ఒంట్లో నలతగా ఉండటంతో అక్కడ్నుంచే ఆస్పత్రికి వెళ్లారు. ఆయన నివాసానికి సమీపాన ఉన్న రాయమ్య ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆయన తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నారు. రెండ్రోజుల క్రితం యడియూరప్పకు కరోనా పరీక్షలు చేయగా అందులో నెగిటివ్ అని […]

Update: 2021-04-16 03:54 GMT

బెంగళూరు : కర్నాటక ముఖ్యమంత్రి బిఎస్ యడియూరప్ప రెండోసారి కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై తన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించిన సీఎం.. ఒంట్లో నలతగా ఉండటంతో అక్కడ్నుంచే ఆస్పత్రికి వెళ్లారు. ఆయన నివాసానికి సమీపాన ఉన్న రాయమ్య ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా నిర్ధారణ కావడంతో బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చేరారు. మూడు రోజులుగా ఆయన తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నారు. రెండ్రోజుల క్రితం యడియూరప్పకు కరోనా పరీక్షలు చేయగా అందులో నెగిటివ్ అని తేలింది. కానీ శుక్రవారం మరోసారి టెస్టులు నిర్వహించగా అందులో పాజిటివ్ అని వచ్చింది. కర్నాటకలో బెలగావి పార్లమెంటు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొని వచ్చిన రెండ్రోజులకే ఆయన రెండోసారి కరోనా బారిన పడటం గమనార్హం. గతేడాది ఆగస్టులో యడియూరప్పకు తొలిసారి కరోనా నిర్ధారణ అయింది.

Tags:    

Similar News