కరీంనగర్ వాసికి ఫిలిప్పిన్స్ కార్టూనిస్టు పత్రం
దిశ, కరీంనగర్: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కార్టూన్లు వేసి సమాజంలో చైతన్యాన్ని నింపుతున్న కార్టూనిస్టులకు ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన సిబూ సంస్థ పోటీలు నిర్వహించింది. ఇందులో వరల్డ్ వైడ్‌గా వేలాది మంది కార్టూనిస్టులు పాల్గొనగా, కరీంనగర్‌కు చెందిన కార్టూనిస్ట్ అందులో గెలుపొందినట్టు వెల్లడించారు.అంతే కాకుండా అతన్నిఅభినందిస్తూ ఫిలిప్పిన్స్ సంస్థ సిబూ ప్రశంస పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపించింది. వివరాల్లోకి వెళితే..కరీంనగర్‌లోని వావిలాలపల్లికి చెందిన రాజమౌళి కార్టూన్లు వేసేవాడు.ఆన్‌లైన్‌లో సిబూ సంస్థ నోటిఫికేషన్ చూసి, తాను వేసిన […]
దిశ, కరీంనగర్:
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిపై కార్టూన్లు వేసి సమాజంలో చైతన్యాన్ని నింపుతున్న కార్టూనిస్టులకు ఫిలిప్పిన్స్ దేశానికి చెందిన సిబూ సంస్థ పోటీలు నిర్వహించింది. ఇందులో వరల్డ్ వైడ్‌గా వేలాది మంది కార్టూనిస్టులు పాల్గొనగా, కరీంనగర్‌కు చెందిన కార్టూనిస్ట్ అందులో గెలుపొందినట్టు వెల్లడించారు.అంతే కాకుండా అతన్నిఅభినందిస్తూ ఫిలిప్పిన్స్ సంస్థ సిబూ ప్రశంస పత్రాన్ని ఆన్‌లైన్ ద్వారా పంపించింది. వివరాల్లోకి వెళితే..కరీంనగర్‌లోని వావిలాలపల్లికి చెందిన రాజమౌళి కార్టూన్లు వేసేవాడు.ఆన్‌లైన్‌లో సిబూ సంస్థ నోటిఫికేషన్ చూసి, తాను వేసిన కర్టూన్లను మెయిల్ ద్వారా పంపించాడు.కాంపిటేషన్‌లో జిల్లా వాసి వేసిన కార్టూన్స్ ఎంపిక కావడంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో తనకు అత్యంత అరుదైన అవకాశం దక్కడంపై రాజమౌళి ఆనందాన్ని ఆనందరం వ్యక్తంచేశాడు.