జిల్లాకు జాతీయ అవార్డు రావడం గర్వకారణం :మంత్రి గంగుల

దిశ, కరీంనగర్ సిటీ : జాతీయస్థాయిలో ధీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ పురస్కారం రావడం జిల్లాకు గర్వకారణమని రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామసర్పంచ్ మాదాడి భారతిని మంత్రి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ పోటీతత్వంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు. […]

Update: 2021-04-12 07:01 GMT

దిశ, కరీంనగర్ సిటీ : జాతీయస్థాయిలో ధీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తికరణ్ పురస్కారం రావడం జిల్లాకు గర్వకారణమని రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ స్థాయిలో అవార్డు పొందిన తిమ్మాపూర్ మండలం పర్లపల్లి గ్రామసర్పంచ్ మాదాడి భారతిని మంత్రి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ పోటీతత్వంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు.

జిల్లాకు ప్రతి సంవత్సరం కనీసం 4– 5 జాతీయ అవార్డులు వచ్చేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేయాలని సూచించారు. పర్లపల్లి గ్రామం సాధించిన జాతీయ అవార్డును స్ఫూర్తిగా తీసుకొని జిల్లాలోని అన్ని గ్రామ పంచాయితీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక, శాసన మండలి సభ్యులు నారదాసు లక్ష్మణ్ రావు, చొప్పదండి శాసన సభ్యులు సుంకె రవిశంకర్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News