ఆయనెటు.. కాంగ్రెస్సా? కాషాయమా?

        కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేసిన కటకం మృత్యుంజయం కాంగ్రెస్‌లోనే ఉండనున్నారా? లేక కాషాయ జెండా కప్పుకోనున్నారా? అదీ కాక కారెక్కనున్నారా? అన్న అనుమానాలు ఉపందుకున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మృత్యుంజయ రాజీనామా చేసి నెల రోజులు దాటింది. ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు.. రాజీనామా చేసిన వ్యక్తి కూడా నెల […]

Update: 2020-02-04 00:23 GMT

రీంనగర్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పని చేసిన కటకం మృత్యుంజయం కాంగ్రెస్‌లోనే ఉండనున్నారా? లేక కాషాయ జెండా కప్పుకోనున్నారా? అదీ కాక కారెక్కనున్నారా? అన్న అనుమానాలు ఉపందుకున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మృత్యుంజయ రాజీనామా చేసి నెల రోజులు దాటింది. ఆయన రాజీనామాపై పార్టీ అధిష్టానం ఏ నిర్ణయమూ తీసుకోవడం లేదు.. రాజీనామా చేసిన వ్యక్తి కూడా నెల రోజులుగా ఏ పార్టీలో చేరనున్నారన్న విషయాన్ని వెల్లడించడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన అనుకూల, వ్యతిరేక వర్గాలు రోజుకో ఊహాగానంతో జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ జెండా కిందకు చేరుబోతున్నారు? అన్నది ఆసక్తి రేపుతోంది.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌తో వచ్చిన విబేధాల కారణంగా కటకం మృత్యుంజయం రాజీనామా చేయగా దానిని ఇంకా అధిష్టానం ఆమోదించలేదు. అదే సమయంలో పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు కూడా ఇప్పటికే ఆయనతో మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామాను అధిష్టానం ఆమోదించలేదని, త్వరలోనే ఆయన పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టనున్నారని కూడా ఆయన వర్గీయులు చెబుతున్నారు. అదే సమయంలో పార్టీని వీడవద్దని సూచించిన అధిష్టానం, తెలంగాణ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించనున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంతవరకు ఏ పార్టీలోనూ జాయినవ్వలేదని పలువురు పేర్కొంటున్నారు.

ఇతర పార్టీల్లో ఏ పార్టీలో చేరితే భవిష్యత్ ఉంటుందని ఆలోచనలు చేస్తూనే ఆయన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో కూడా టచ్ లో కొనసాగుతున్నారు. పార్టీ పదవిని అందుకోవాలా? లేక బీజేపీ నుంచి వచ్చిన ఆఫర్ ను అంగీకరించాలా? అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కాషాయం నీడన చేరాలంటూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ వ్యక్తిగతంగా కలిసి చర్చలు జరపగా, ఎంపీ బండి సంజయ్ కూడా పార్టీలో చేరమంటూ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన రెండు జాతీయ పార్టీల్లో ఏ పార్టీలో చేరితే భవిష్యత్ బావుంటుందన్న ఆలోచనల్లో మునిగినట్టు తెలుస్తోంది.

గత ఏడాదిన్నర కాలంగా వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న నేపథ్యంలో మృత్యుంజయం రాజీనామా తమకు అనుకూలంగా మారుతుందని పొన్నం భావించారు. కుంతియాతో పాటు ఇతర నాయకులు ఆయన రాజీనామాను ఆమోదించకుండా చర్చలు జరపడం పొన్నం వర్గానికి మింగుడు పడడం లేదు. జిల్లా కాంగ్రెస్ ని ఒంటి చేత్తో నడిపించాలనుకున్న పొన్నంకి ఈ వ్యవహారం గిట్టడం లేదు. దీంతో జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయోనన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది.

Tags:    

Similar News