ఆ సమావేశంలో… మీడియాకు నో ఎంట్రీ
దిశ, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ మీటింగ్ కవరేజ్‌కు వెల్లిన మీడియా ప్రతినిధులకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. సమావేశం జరుగుతున్న కలెక్టరేట్ ఆడిటోరియంలో కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిదులను లోనికి అనుమతించకుండా బయటకు పంపించారు. సర్వసభ్య సమావేశాల్లో జరిగే చర్చను సమాజానికి అందించేందుకు మీడియా వెళితే బయటకు వెళ్లగ్గొట్టడంపై జర్నలిస్టులు నిరసన తెలిపారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కవరేజీకి కూడా మీడియాను అనుమతిస్తుంటే కరీంనగర్ బల్దియాలో మాత్రం అనుమతి లేదడం, ఎన్నో అనుమనాలకు తావిస్తోందన్నారు. బీజేపీ కార్పొరేటర్లు […]
దిశ, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్ మీటింగ్ కవరేజ్‌కు వెల్లిన మీడియా ప్రతినిధులకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. సమావేశం జరుగుతున్న కలెక్టరేట్ ఆడిటోరియంలో కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిదులను లోనికి అనుమతించకుండా బయటకు పంపించారు. సర్వసభ్య సమావేశాల్లో జరిగే చర్చను సమాజానికి అందించేందుకు మీడియా వెళితే బయటకు వెళ్లగ్గొట్టడంపై జర్నలిస్టులు నిరసన తెలిపారు.
పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కవరేజీకి కూడా మీడియాను అనుమతిస్తుంటే కరీంనగర్ బల్దియాలో మాత్రం అనుమతి లేదడం, ఎన్నో అనుమనాలకు తావిస్తోందన్నారు. బీజేపీ కార్పొరేటర్లు కూడా ఈ విషయంపై తమ నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా నిధులు కేటాయిస్తే కేసీఆర్ జలం అని పేరు పెట్టుకోవడంతో, బీజేపీ సభ్యులు ఆందోళన చేశారు.