నిజం చెప్పాలంటే ధైర్యముండాలి!.. నటి ఆటోబయోగ్రఫీపై డిస్కషన్
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’ రిలీజ్ అయింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి బీటౌన్‌లో విజయవంతమైన సెకండ్ ఇన్నింగ్స్ వరకు.. నీనా తన ప్రయాణాన్ని ఇందులో పొందుపరిచింది. కాగా వర్చువల్ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ప్రశంసలు కురిపించింది. ఈ పుస్తకం చదివాక నీనా గుప్తాపై మరింత గౌరవం పెరిగిందని తెలిపింది. తన ఆటోబయోగ్రఫీలో రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా […]
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్ట్రెస్ నీనా గుప్తా ఆటోబయోగ్రఫీ ‘సచ్ కహూ తో’ రిలీజ్ అయింది. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి బీటౌన్‌లో విజయవంతమైన సెకండ్ ఇన్నింగ్స్ వరకు.. నీనా తన ప్రయాణాన్ని ఇందులో పొందుపరిచింది. కాగా వర్చువల్ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ ఖాన్ ఈ పుస్తకాన్ని రిలీజ్ చేస్తూ ప్రశంసలు కురిపించింది. ఈ పుస్తకం చదివాక నీనా గుప్తాపై మరింత గౌరవం పెరిగిందని తెలిపింది. తన ఆటోబయోగ్రఫీలో రిలేషన్‌షిప్స్ గురించి ఓపెన్‌గా చెప్పడాన్ని కొనియాడిన బెబో.. ఇందుకు చాలా ధైర్యం అవసరమని అభిప్రాయపడింది. ఇలాంటి సంబంధాల గురించి బహిరంగంగా చర్చించేందుకు ఎవరూ ముందుకురారని తెలిపింది. ఇక కరీనా తన కూతురు మసాబా గుప్తా వయస్సులో ఉన్నప్పటికీ.. తనకు స్ఫూర్తిని పంచిందని తెలిపింది నీనా గుప్తా. తను ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలోనూ ఎలాంటి స్ట్రెస్ లేకుండా వర్క్ చేసి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచిందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అందుకే తన ఆటోబయోగ్రఫీ రిలీజ్ చేసేందుకు కరీనాను ఎంచుకున్నట్లు చెప్పింది నీనా.