ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం కోసమే కరాటే..

దిశ ఖమ్మం, కల్చరల్: ముఖ్యంగా ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించటానికి కరాటే విద్య కూడా ఒక భాగమేనని, విద్యార్థులు చదువుతోపాటు కరాటే విద్యను కూడా నేర్చుకుని ఏదైనా ఆకతాయిల, వేదింపులు జరిగినపుడు వాటిని దైర్యంతో ఎదుర్కొనటానికి ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రశంసా పత్రాల అందజేత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం మహిళల, యువతుల […]

Update: 2021-09-13 10:02 GMT

దిశ ఖమ్మం, కల్చరల్: ముఖ్యంగా ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యం పెంపొందించటానికి కరాటే విద్య కూడా ఒక భాగమేనని, విద్యార్థులు చదువుతోపాటు కరాటే విద్యను కూడా నేర్చుకుని ఏదైనా ఆకతాయిల, వేదింపులు జరిగినపుడు వాటిని దైర్యంతో ఎదుర్కొనటానికి ఈ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ అన్నారు. సోమవారం ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విద్యార్థులకు ప్రశంసా పత్రాల అందజేత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణా ప్రభుత్వం మహిళల, యువతుల రక్షణ కోసం ఏర్పాటు చేసిన షి టీమ్స్, బాగా పనిచేస్తున్నాయని ఆమె అభివర్ణించారు.

చిన్నారులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆమె అకాంక్షిoచారు. ఖమ్మం డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ టెక్నికల్ డైరెక్టర్ షేక్ ఖాసిం అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 45వ డివిజన్ కార్పొరేటర్ బుడిగెం శ్రీనివాస్, చిన్నారుల పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Read more: పాఠశాలలో కరోనా కలకలం.. ఆందోళనలో తల్లిదండ్రులు
Tags:    

Similar News