వైఎస్సార్సీపీలో చేరీ చేరని బలరాం!
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన టీడీపీ కీలక సీనియర్ నేత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైఎస్సార్సీపీలో చేరీ చేరకుండా ఉన్నారు. ఇతర పార్టీ నేతలు ఎవరైనా తమ పార్టీలోకి రావాలనుకుంటే పదవులన్నింటికీ రాజీనామా చేసి రావాలని జగన్ గతంలో షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ షరతు నేపథ్యంలోనే కరణం బలరాం వైఎస్సార్సీపీలో చేరీ చేరకుండా ఉన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాసులు ప్రోద్బలం, మద్య వర్తిత్వం నేపథ్యంలో కరణం […]
టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన టీడీపీ కీలక సీనియర్ నేత చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైఎస్సార్సీపీలో చేరీ చేరకుండా ఉన్నారు. ఇతర పార్టీ నేతలు ఎవరైనా తమ పార్టీలోకి రావాలనుకుంటే పదవులన్నింటికీ రాజీనామా చేసి రావాలని జగన్ గతంలో షరతు విధించిన సంగతి తెలిసిందే. ఈ షరతు నేపథ్యంలోనే కరణం బలరాం వైఎస్సార్సీపీలో చేరీ చేరకుండా ఉన్నారు.
మంత్రి బాలినేని శ్రీనివాసులు ప్రోద్బలం, మద్య వర్తిత్వం నేపథ్యంలో కరణం బలరాం తన కుమారుడితో కలిసి నిన్న సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన సమక్షంలో కుమారుడితో సహా వైఎస్సార్సీపీలో చేరారు. అయితే ఆయన పార్టీలో చేరుతున్నట్టు ఎలాంటి ప్రకటన చేయలేదు. సాంకేతిక కారణాల నేపథ్యంలో తన కుమారుడు కరణం వెంకటేష్, చీమకుర్తి తెలుగు యువత జిల్లా మాజీ అధ్యక్షుడు మన్నం శ్రీధర్‌లు మాత్రం వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. బలరాంతో సన్నిహిత సంబంధాలు ఉన్న నేతలు మౌనం వహించడం విశేషం.
శాసనమండలి రద్దు నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ వైఎస్సార్సీపీలోకి మారిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల ఫలితాల తరువాత గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైఎస్సార్సీపీవైపు మొగ్గు చూపారు. దీంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయనను పార్టీ సస్పెండ్ చేసింది. దీంతో మండిపడ్డ వంశీ.. పార్టీ తనను సస్పెండ్ చేయడమేంటి? తానే పార్టీని సస్పెండ్ చేస్తున్నానంటూ పార్టీని బహిష్కరించారు. దీంతో ఆయన వైఎస్సార్సీపీలో చేరుతారని అంతా భావించారు. అయితే ఆయన అలా చేయలేదు. తాజాగా కరణం బలరాం కూడా తాను వైఎస్సార్సీపీలో చేరుతున్నట్టు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఆయన కుమారుడు వైఎస్సార్సీపీ తీర్ధం పుచ్చుకున్నట్టు ప్రకటించారు. దీంతో ఆయన శాసనసభలో టీడీపీ, వైఎస్సార్సీపీ సభ్యులతో కాకుండా వంశీతో పాటు ప్రత్యేకంగా కూర్చోనున్నారు.
tags : KARANAM BALARAM, karanam venkatesh, mannam sridhar, ysrcp, tdp, jagan