Tirumala: అప్పుడు పాత్రధారులు.. ఇప్పుడు సూత్రధారులు.. మరో ఛార్జిషీట్ దాఖలుకు రెడీ..!

తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది.

Update: 2025-04-06 12:34 GMT
Tirumala: అప్పుడు పాత్రధారులు.. ఇప్పుడు సూత్రధారులు.. మరో ఛార్జిషీట్ దాఖలుకు రెడీ..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ కేసు(Tirumala laddu prasadam adulteration case)లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీబీఐ అధికారులు(CBI officers) మరో చార్జిషీటు దాఖలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ఈ కేసులో ఏఆర్ డెయిరీ(AR Dairy), బోలే బాబా(Bole Baba), వైష్ణవి డెయిరీ(Vaishnavi Dairy) నిర్వాహకులను సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తొలి ఛార్జిషీట్ తర్వాత సీబీఐ బృందంలోని సిట్ అధికారులు రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు. తొలి దశలో పాత్రధారులను అరెస్ట్ చేయగా రెండో దశలో సూత్రధారులపై ఫోకస్ పెట్టనున్నారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేలా నిబంధనలను మార్చడంపై దర్యాప్తు కొనసాగించనున్నారు. వైసీపీ హయాంలోని టీటీడీ పాలక వర్గానికి చెందిన కొందరు సభ్యులు, అధికారుల పాత్రపై ఇప్పటికే సీట్‌కు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. రెండో దశ దర్యాప్తులో ప్రధానంగా వీరిపైనే ఫోకస్ పెట్టనున్నట్లు సమాచారం.

కాగా తిరుమల లడ్డూ కల్తీ కేసులో ఇప్పటికే ఆరుగురు అధికారులను అదుపులోకి తీసుకుని కస్టడీలో ప్రశ్నించారు. అయితే లడ్డూకు వినియోగించిన నెయ్యిని ఏఆర్ డెయిరీ నుంచి కాకుండా ఇతర డెయిరీ నుంచి సేకరించారని సాక్ష్యాలను సీబీఐ ఆధ్వర్యంలో సిట్ బృందం అధికారులు ఇప్పటికే సేకరించారు. కొన్ని వే బిల్లులతో పాటు స్క్రిప్ షీట్లను కూడా సేకరించారు. ఈ ఆరుగురు పాత్రధారులపై మరొక  ఛార్జిషీట్ వేసేందుకు సిద్ధమవుతున్నారు.. ఈ ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు. 

తిరుమల లడ్డూకు గతంలో కర్ణాటకకు చెందిన నంది డెయిరీ నెయ్యి సరఫరా చేసింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి ఆ కాంట్రాక్టును ఇచ్చేలా నిబంధనలు మార్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. అయితే ఈ కేసుకు సంబంధించి మొదటి దశలో పాత్రధారులపై ఛార్జిషీటు వేశారు. ఇప్పుడు రెండో దశలో సూత్రధారులు ఎవరు అనేది తేల్చి ఛార్జిషీట్ వేయాలని నిర్ణయించారు. వైసీపీ పాలనలోని కొంతమంది నేతలు, టీటీడీ అధికారులు నిబంధనలు మార్చడం వల్లే ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ దక్కిందని అనేది అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం ఉందని తెలుస్తోంది. ఆ దిశలోనే సూత్రధారుల వ్యవహారాన్ని బయట పెట్టేందుకే రెండో దశ దర్యాప్తు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా రెండో చార్జిషీటు దాఖలు చేసేందుకు అధికారులు  సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. 

Tags:    

Similar News