రికార్డు స్థాయిలో బీజేపీ సభ్యత్వాలు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు జరుగుతున్న వేళ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు..

Update: 2025-04-06 11:49 GMT
రికార్డు స్థాయిలో బీజేపీ సభ్యత్వాలు.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో బీజేపీ సభ్యత్వ నమోదు(BJP Membership Registration) కార్యక్రమం జరుగుతున్న వేళ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు(MLA Vishnu Kumar Raju) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 25 లక్షల బీజేపీ సభ్యత్వాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(Tirupati District Srikalahasti)లో నిర్వహించిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం(BJP Foundation Day Celebration)లో కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, ఎమ్మెల్సీ సోము వీర్రాజు(MLC Somu Veerraju)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు కుమార్‌ మాట్లాడుతూ దేశంలోనే బలమైన పార్టీగా బీజేపీ ఎదిగిందని చెప్పారు. రాష్ట్ర జనాల్లో పార్టీపై నమ్మకం పెరిగిందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వం భారత్‌కు సుపరిపాలన అధిస్తోందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.

బీజేపీ నాయక్వతానికి అధికార వ్యామోహం లేదని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ(Union Minister Bhupathi Raju Srinivasa Varma) తెలిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ కీర్తిని ప్రధాని మోడీ పెంచారని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ బీజేపీ అని శ్రీనివాసవర్మ తెలిపారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు(MLC Somu Veerraju) మాట్లాడుతూ దేశంలోనే బలమైన పార్టీగా బీజేపీ ఎదిగిందన్నారు. శాస్త్రవేత్త, దళిత నేత, గిరిజన నాయకురాలిని దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత బీజేపీదేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.            

Tags:    

Similar News