టీడీపీలో మరో వికెట్ డౌన్.. ఇది గట్టి షాకే

టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా నుంచి ఆ పార్టీని వీడేవారు పెరిగిపోతున్నారు. ఒకరి తరువాత ఒకరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. టీడీపీ అధినేతకు బలమైన అండగా పేర్కొనే నేతలు పార్టీ వీడుతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలో అయోమయం, నైరాశ్యం పెరుగుతోంది. మొన్ని డొక్కా, నిన్న సతీష్ రెడ్డి, ఆ తరువాత కదిరి బాబూరావు, ఇప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి (బలరాం) పార్టీని వీడుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. సతీష్ రెడ్డి […]

Update: 2020-03-12 01:55 GMT

టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా నుంచి ఆ పార్టీని వీడేవారు పెరిగిపోతున్నారు. ఒకరి తరువాత ఒకరుగా టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. టీడీపీ అధినేతకు బలమైన అండగా పేర్కొనే నేతలు పార్టీ వీడుతుండడంతో ఆ పార్టీ కార్యకర్తలో అయోమయం, నైరాశ్యం పెరుగుతోంది.

మొన్ని డొక్కా, నిన్న సతీష్ రెడ్డి, ఆ తరువాత కదిరి బాబూరావు, ఇప్పుడు కరణం బలరామకృష్ణమూర్తి (బలరాం) పార్టీని వీడుతుండడం ఆందోళనకు గురి చేస్తోంది. సతీష్ రెడ్డి సుదీర్ఘ కాలం టీడీపీలో ఉంటూ రాజశేఖరరెడ్డి కుటుంబంతో పోరాడారు. బాలయ్య బాబుకు బాబూరావు సన్నిహితుడు. ప్రకాశం జిల్లాలోని టీడీపీకి పెద్ద దిక్కు, చంద్రబాబునాయుడుకి సన్నిహితుడిగా పేర్కొనే చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం పార్టీని వీడనుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మరికాసేపట్లో కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేశ్ ఇద్దరూ వైఎస్సార్సీపీలో చేరనున్నారు. ప్రకాశం జిల్లాలో గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరు. గొట్టిపాటి రవి వర్గంతో బలరాం వర్గానికి విభేదాలున్నాయి. ఈ రెండు వర్గాలు పలు సందర్భాల్లో బహిరంగంగా దాడులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కరణం బలరాం వైఎస్సార్సీపీలో చేరడం ఆసక్తిరేపుతోంది. స్వయంగా కరణం బలరాం పార్టీ మారుతున్నట్టు ప్రకటించడం టీడీపీలో కలకలం రేపుతోంది.

Tags:    

Similar News