‘చేంజ్ వితిన్’.. కరణ్ ఎపిక్ సిరీస్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఎపిక్ సిరీస్ అనౌన్స్ చేశారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ‘చేంజ్ వితిన్’ పేరుతో సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్ క్రియేటివ్ ఫ్రెటర్నిటీ రాజ్ కుమార్ సంతోషి, దినేశ్ విజన్, మహవీర్ జైన్ ఈ సిరీస్ కోసం పనిచేయనుండగా.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి స్ఫూర్తి పొందుతూ భారత స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి సంబంధించిన ఇంక్రెడిబుల్ స్టోరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. […]

Update: 2020-12-22 07:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఎపిక్ సిరీస్ అనౌన్స్ చేశారు. 75 ఏళ్ల భారత స్వాతంత్ర్యాన్ని సెలబ్రేట్ చేసుకునే క్రమంలో ‘చేంజ్ వితిన్’ పేరుతో సిరీస్‌ను తెరకెక్కిస్తున్నట్లు వెల్లడించారు. ఫిల్మ్ క్రియేటివ్ ఫ్రెటర్నిటీ రాజ్ కుమార్ సంతోషి, దినేశ్ విజన్, మహవీర్ జైన్ ఈ సిరీస్ కోసం పనిచేయనుండగా.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి స్ఫూర్తి పొందుతూ భారత స్వేచ్ఛా స్వాతంత్ర్యానికి సంబంధించిన ఇంక్రెడిబుల్ స్టోరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలిపారు.

మనం ఎవరు? మన సంస్కృతి ఏంటి? మన సంప్రదాయక పద్ధతులు ఏంటి? అనే విషయాలను భారత్‌లోని నలుమూలలకు చాటిచెప్పేలా ఈ శక్తిమంతమైన కథ ఉండబోతుందన్నారు కరణ్. గతేడాది మహాత్మాగాంధీ 150వ జన్మదినం సందర్భంగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఒక ప్రత్యేక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని.. ఇప్పుడు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని జరుపుకునేందుకు కలిసి వస్తున్నామని తెలిపారు. ‘చేంజ్ వితిన్’.. భారత ఆత్మ గురించి వివరించే ఫ్రెష్ బిగినింగ్‌కు విట్‌నెస్‌గా ఉంటుందన్నారు. త్వరలో ఇందుకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూ గురించి వివరించనున్నట్లు తెలిపారు కరణ్.

Tags:    

Similar News