యూపీలో కప్పా వేరియంట్ కేసులు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 109 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ ఈ విషయాన్ని తెలిపింది. 107 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ అని పేర్కొంది. ఈ వేరియంట్లు రాష్ట్రానికి కొత్తేమీ కాదని, గతంలోనూ ఇవి నమోదయ్యాయని వివరించింది. ‘ఈ వేరియంట్ గురించి ఆందోళనపడాల్సిన పనిలేదని, చికిత్సతో దీన్ని ఎదుర్కోవచ్చునని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి(ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. ఏ జిల్లాలో నమోదయ్యాయో […]

Update: 2021-07-09 06:33 GMT

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో రెండు కప్పా వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. 109 శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన కింగ్ జార్జ్ మెడికల్ కాలేజీ ఈ విషయాన్ని తెలిపింది. 107 కేసులు డెల్టా ప్లస్ వేరియంట్ అని పేర్కొంది. ఈ వేరియంట్లు రాష్ట్రానికి కొత్తేమీ కాదని, గతంలోనూ ఇవి నమోదయ్యాయని వివరించింది. ‘ఈ వేరియంట్ గురించి ఆందోళనపడాల్సిన పనిలేదని, చికిత్సతో దీన్ని ఎదుర్కోవచ్చునని రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి(ఆరోగ్యం) అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. ఏ జిల్లాలో నమోదయ్యాయో చెప్పడానికి నిరాకరించారు. ఆ వివరాలు ప్రజలను భయపెట్టిస్తాయని తెలిపారు.

Tags:    

Similar News