రామ మందిర విరాళాలు : ఇలాంటి దొంగలతో తస్మాత్ జాగ్రత్త
దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో తలపెట్టిన రామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 28 రోజులుగా సేకరిస్తున్న రామమందిర నిర్మాణం విరాళాలు రూ.1000 కోట్లు దాటాయి. అయితే ఈ విరాళాల ముసుగులో కొంతమంది కేటుగాళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో విరాళాలు ఇచ్చే సమయంలో ఇలాంటి దొంగలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కాన్పూర్ లో ఇద్దరు దుండగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు చంద్రప్రకాష్ త్రిపాఠి, […]
దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో తలపెట్టిన రామ మందిర నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళలు సేకరిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 28 రోజులుగా సేకరిస్తున్న రామమందిర నిర్మాణం విరాళాలు రూ.1000 కోట్లు దాటాయి. అయితే ఈ విరాళాల ముసుగులో కొంతమంది కేటుగాళ్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. దీంతో విరాళాలు ఇచ్చే సమయంలో ఇలాంటి దొంగలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తాజాగా కాన్పూర్ లో ఇద్దరు దుండగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితులు చంద్రప్రకాష్ త్రిపాఠి, అశోక్ రాజ్ పుత్‌లు రామ మందిర నిర్మాణాల కోసం విరాళాలు సేకరిస్తున్నామంటూ ఫేక్ రిసిప్ట్‌లతో భక్తుల నుంచి భారీగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కష్టడీలో ఉన్న నిందితుల వద్ద నుంచి ఫేక్ రిసిప్ట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు కాన్పూర్ సౌత్ ఎస్పీ దీపక్ తెలిపారు.