కన్నతల్లినే కడతేర్చిన కొడుకు.. అసలు ఏం జరిగింది..?
దిశ, గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కెటి దొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు తల్లి శాంతమ్మను కొడుకు దాసరి వెంకటేష్ దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే మృతురాలు శాంతమ్మకు రెండో కుమారుడైన వెంకటేష్ తాగుడుకు బానిసై డబ్బుల గురించి పలుమార్లు తల్లిని కొట్టేవాడు. నిందితుడు వెంకటేష్ కు రెండు పెళ్లిళ్లు కాగా అతని వేధింపులు భరించలేక ఇద్దరూ భార్యలు వదిలి వెళ్లారని, అయితే నిన్న రాత్రి మద్యం సేవించి […]
దిశ, గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా కెటి దొడ్డి మండలంలోని గువ్వలదిన్నె గ్రామంలో మద్యం కోసం డబ్బులు ఇవ్వనందుకు తల్లి శాంతమ్మను కొడుకు దాసరి వెంకటేష్ దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే మృతురాలు శాంతమ్మకు రెండో కుమారుడైన వెంకటేష్ తాగుడుకు బానిసై డబ్బుల గురించి పలుమార్లు తల్లిని కొట్టేవాడు.
నిందితుడు వెంకటేష్ కు రెండు పెళ్లిళ్లు కాగా అతని వేధింపులు భరించలేక ఇద్దరూ భార్యలు వదిలి వెళ్లారని, అయితే నిన్న రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన వెంకటేష్ మల్లి తనకు మద్యం కోసం డబ్బుల కావాలని తల్లితో గొడవపడ్డాడు. దీంతో వేంకటేష్ కోపంలో తల్లిని కర్రతో బలంగా కొట్టగా ఆమెకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి వదిన ఫిర్యాదు మేరకు కెటి దొడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు.