కన్నడ సీరియల్ నటి మృతి..

కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి మెబీనా మైఖేల్ కన్నుమూసింది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెబీనా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మెబీనా మరణంపై కన్నడ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంత చిన్న వయసులోనే మెబీనా చనిపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు తోటి నటీనటులు. మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మేబీనా.. ప్యాటే హుదుగిర్ హల్లి లైఫ్ రియాలిటీ షో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. టెలివిజన్ పరిశ్రమలోకి ఎంటర్ […]

Update: 2020-05-27 08:42 GMT

కన్నడ పరిశ్రమకు చెందిన బుల్లితెర నటి మెబీనా మైఖేల్ కన్నుమూసింది. మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మెబీనా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. మెబీనా మరణంపై కన్నడ టీవీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇంత చిన్న వయసులోనే మెబీనా చనిపోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు తోటి నటీనటులు.

మోడల్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన మేబీనా.. ప్యాటే హుదుగిర్ హల్లి లైఫ్ రియాలిటీ షో విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. టెలివిజన్ పరిశ్రమలోకి ఎంటర్ అయిన మెబీనా పలు ప్రాజెక్టులతో బిజీగా మారింది. లాక్‌న్ కారణంగా రెండు నెలలు ఇంటికే పరిమితమైన ఆమె.. ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుతో స్వగ్రామం మెడికెరికి స్నేహితులతో కలిసి పయనమైంది. కానీ, మధ్యలోనే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ట్రాక్టర్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తరలించగా మెబీనా చికిత్స పొందుతూ మృతి చెందింది. తన స్నేహితులకు చికిత్స కొనసాగుతుండగా కోలుకుంటున్నట్లు సమాచారం.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..