వైజాగ్‌లో నాభూమే కబ్జా చేయబోయారు: కన్నా
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిలో భూకబ్జా కోరుల దురాగతాలు హద్దు మీరుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణం జిల్లా భీమిలి సమీపంలో ఉన్న తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సంచలన ఆరోపణ చేశారు. భీమిలి, విశాఖపట్టణం మధ్యలోని చేపలుప్పాడలో 1993లో ఒక స్థలం కొన్నానని అన్నారు. తన స్థలం పక్కనే ఓ పోలీసు అధికారం స్థలం కూడా ఉందని ఆయన […]
ఆంధ్రప్రదేశ్ ఎగ్జిక్యూటివ్ రాజధానిలో భూకబ్జా కోరుల దురాగతాలు హద్దు మీరుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విజయనగరం జిల్లాలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్టణం జిల్లా భీమిలి సమీపంలో ఉన్న తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సంచలన ఆరోపణ చేశారు.
భీమిలి, విశాఖపట్టణం మధ్యలోని చేపలుప్పాడలో 1993లో ఒక స్థలం కొన్నానని అన్నారు. తన స్థలం పక్కనే ఓ పోలీసు అధికారం స్థలం కూడా ఉందని ఆయన చెప్పారు. ఆ రెండు స్థలాలను కబ్జా చేసేందుకు కబ్జాకోరులు ప్రయత్నించారని ఆయన వెల్లడించారు. ఈ విషయం పక్కనే స్థలం గల పోలీసు అధికారి చెప్పినంత వరకు తనకు తెలియదని ఆయన తెలిపారు. విశాఖలో మన భూములను ఎవరో ఆక్రమించుకుంటున్నారండీ అని పోలీసు అధికారి ఫోన్ చేశారని ఆయన చెప్పారు.
అక్కడికి మా మనిషిని పంపిస్తున్నాను, మీరు కూడా మీ మనిషిని పంపించండి అని సూచించారని తెలిపారు. వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే అప్పటికే అక్కడ ఫెన్సింగ్ వేసేశారని తెలిపారు. అక్కడ ఫెన్సింగ్ వేసిన వారిని గట్టిగా నిలదీస్తే, ఇది సార్ స్థలం అనుకోలేదని అన్నారని ఆయన చెప్పారు. ఈ మధ్య కాలంలో విశాఖలో భూమాఫియాకు వందలాది మంది బలయ్యారని ఆయన ఆరోపించారు.
ఈ మధ్య కాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి, విశాఖలోని భూ యజమానులు భయపడుతున్నారని ఆయన మండిపడ్డారు. తుపాకీ ఎక్కుపెట్టి భూములకు సంబంధించిన సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితి కేవలం విశాఖపట్టణానికే పరిమితం కాదని, విజయనగరం జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Tags: ap, land mafia, land grabars, real estate business, kanna laxminarayana, visakhapatnam, bheemili