బీజేపీ, జనసేన కలిసి పోటీ : కన్నా

           సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముస్లీంలను, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఏ భారతీయుడి పౌరసత్వం సీఏఏ తీసేయదని స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దానిపై అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీజేపీ, జనసేన కలిసి స్థానిక ఎన్నికల్లో పనిచేస్తాయన్నారు. విశాఖకు సచివాలయం వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానులు […]

Update: 2020-02-09 06:08 GMT

సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముస్లీంలను, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఏ భారతీయుడి పౌరసత్వం సీఏఏ తీసేయదని స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దానిపై అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీజేపీ, జనసేన కలిసి స్థానిక ఎన్నికల్లో పనిచేస్తాయన్నారు. విశాఖకు సచివాలయం వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

Tags:    

Similar News