కంకణ బట్టార్ సీతారామాచార్యులు ఇకలేరు
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తుమ్మలగుంట కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆగమ సలహాదారు, కంకణ బట్టార్ సీతారామాచార్యులు అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం తుమ్మల గుంటలో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చెవిరెడ్డి అంత్య క్రియల్లో పాల్గొన్నారు. కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, మూలవిరాట్టును ప్రతిష్టించడంలాంటి పవిత్ర కార్యక్రమాలను ఆయన […]
దిశ, ఏపీ బ్యూరో: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తుమ్మలగుంట కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ ఆగమ సలహాదారు, కంకణ బట్టార్ సీతారామాచార్యులు అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం తుమ్మల గుంటలో అంత్యక్రియలు జరిగాయి. అంతకుముందు ప్రభుత్వ విప్, తుడా చైర్మన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం చెవిరెడ్డి అంత్య క్రియల్లో పాల్గొన్నారు. కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, మూలవిరాట్టును ప్రతిష్టించడంలాంటి పవిత్ర కార్యక్రమాలను ఆయన చేపట్టారని చెవిరెడ్డి ఈ సందర్భంగా కొనియాడారు. ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారని గుర్తుచేసుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగానే కాకుండా చిన్నతనం నుంచి తుమ్మలగుంట స్థానికుడుగా సీతారామాచార్యులతో తనకున్న అనుబంధాన్ని తెలియజేశారు.