'బాఘీ -3' డైరెక్టర్‌పై కంగనా సిస్టర్స్ ఫైర్
దిశ, వెబ్‌డెస్క్: ‘బాఘీ – 3’ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలు కంగనా సిస్టర్స్‌కు ఆగ్రహాన్ని కలిగించాయి. ఓ ఇంటర్వ్యూలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ గురించి మాట్లాడిన అహ్మద్ ఖాన్… ‘మణికర్ణిక’ సినిమాతో కంగనా రనౌత్ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ట్రై చేసి నిర్మాతకు నష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ఝాన్సీ రాణి కథతో ఇండస్ట్రీలో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేశారని.. కానీ చివరికి వద్దనుకున్నారని తెలిపాడు. ‘మణికర్ణిక’ సినిమా ఎఫెక్ట్‌తో కంగనా ‘ధకాడ్’ కూడా సినిమా ఆగిపోయిందన్నారు. ఈ […]
దిశ, వెబ్‌డెస్క్: ‘బాఘీ – 3’ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ వ్యాఖ్యలు కంగనా సిస్టర్స్‌కు ఆగ్రహాన్ని కలిగించాయి. ఓ ఇంటర్వ్యూలో లేడీ ఓరియంటెడ్ మూవీస్ గురించి మాట్లాడిన అహ్మద్ ఖాన్… ‘మణికర్ణిక’ సినిమాతో కంగనా రనౌత్ ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ట్రై చేసి నిర్మాతకు నష్టాలను తెచ్చిపెట్టిందన్నారు. ఝాన్సీ రాణి కథతో ఇండస్ట్రీలో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేశారని.. కానీ చివరికి వద్దనుకున్నారని తెలిపాడు. ‘మణికర్ణిక’ సినిమా ఎఫెక్ట్‌తో కంగనా ‘ధకాడ్’ కూడా సినిమా ఆగిపోయిందన్నారు. ఈ కామెంట్‌తో మండిపోయిన కంగనా సిస్టర్ రంగోలి చందేల్.. అహ్మద్ ఖాన్‌పై సోషల్ మీడియాలో విరుచుకుపడింది. ఒక్క సినిమా కూడా సక్సెస్ ఫుల్‌గా తీయలేని డైరెక్టర్ అహ్మద్ ఖాన్… ఇలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటూ కామెంట్ చేసింది. మీకు తెలుసో లేదో… మణికర్ణిక ఇండియాలోనే కాదు జపాన్‌లో కూడా హిట్ మూవీ అని తెలిపింది. ఐతే ఈ విషయంలో అహ్మద్ ఖాన్ కంగనాకు కాల్ చేశాడని .. క్షమాపణ చెప్పాడని తెలిపిన రంగోలి.. అయినా కూడా వదిలే ప్రసక్తే లేదని చెప్పింది. ‘ధకాడ్’ సినిమా యూనిట్ నుంచి అహ్మద్ ఖాన్‌కు నోటీసులు అందుతాయని స్పష్టం చేసింది.
Tags: Kangana Ranaut, Kangana Sisters, Ahmed Khan, Baaghi – 3 Director