కంగనా రనౌత్‌‌పై ఢిల్లీ అసెంబ్లీ కమిటీ సీరియస్.. విచారణకు ఆదేశం

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవల ప్రధానమంత్రి మోడీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన క్రమంలో కంగనా సిక్కులను ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిలో భాగంగా నవంబర్ 25న ఢిల్లీ అసెంబ్లీ కమిటీ కంగనా రనౌత్‌కు సమన్లు ​జారీ చేసింది. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఆమె ఇటీవల చేసిన ‘ఖలిస్థానీ […]

Update: 2021-11-25 05:13 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి చిక్కుల్లో పడింది. ఇటీవల ప్రధానమంత్రి మోడీ మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన క్రమంలో కంగనా సిక్కులను ఉద్దేశిస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఢిల్లీ అసెంబ్లీ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

దీనిలో భాగంగా నవంబర్ 25న ఢిల్లీ అసెంబ్లీ కమిటీ కంగనా రనౌత్‌కు సమన్లు ​జారీ చేసింది. సిక్కు కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఆమె ఇటీవల చేసిన ‘ఖలిస్థానీ టెర్రరిస్ట్’ వ్యాఖ్యలపై కంగనాపై నమోదైన ఫిర్యాదులపై ఆమెకు సమన్లు జారీ చేసినట్లు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ పేర్కొంది. ఆమె చేసిన వ్యాఖ్యలు అవమానకరమైనవిగా, బాధ కలిగించే విధంగా ఉన్నాయని విచారం వ్యక్తం చేసింది. కాగా, కంగనాకు ఢిల్లీ అసెంబ్లీ కమిటీ డిప్యూటీ సెక్రటరీ సదానంద్ షా నోటీసు జారీ చేశారు. డిసెంబర్ 6న తమ ముందు హాజరు కావాలని రనౌత్‌ను ఆదేశించారు.

Tags:    

Similar News