Manipurలో బీజేపీకి షాక్.. మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రావణకాష్టంలా రగిలిపోతుంది. మైయితీలు, కూకీలక మధ్య వైరంతో ఏడాదిన్నర నుంచి రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా దిగజారిపోతోంది.

Update: 2024-11-18 05:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రావణకాష్టంలా రగిలిపోతుంది. మైయితీలు, కూకీలక మధ్య వైరంతో ఏడాదిన్నర నుంచి రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలను పరీరక్షించడంతో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలం అయిదంటూ కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలన్నీ విమర్శలు కూడా గుప్పిస్తూ వస్తున్నాయి. బీజేపీ మాత్రం రాష్ట్రంలో పరిస్థితులను తాము అదుపులోనికి తెస్తామంటూ చెబుతూ వస్తోంది. అయితే గత రెండు, మూడు రోజులుగా మళ్లీ కొన్ని ప్రాంతాల్లో హింస రేగడంతో పరిస్థితి మళ్లీ చేయిదాటిపోయేలా కనిపిస్తోంది. ఇలంటి పరిస్థితుల్లో అధికార కూటమిలోని ఎన్‌పీపీ అనూహ్యంగా బీజేపీకి తమ మద్దతు ఇకపై ఉండదని ప్రకటిస్తూ కూటమి నుంచి బయటకు వచ్చేసింది. ఇది ఓ రకంగా బీజేపీకి మణిపుర్‌లో పెద్ద ఎదరుదెబ్బ అనే చెప్పాలి.

మొత్తం 60 మంది సభ్యులున్న సభలో ఎన్పీపీ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలున్నారు. 37 మంది ఎమ్మెల్యేలున్న భారతీయ జనతా పార్టీకి సొంతంగా మెజారిటీ ఉండటంతో మద్దతు ఉపసంహరణ ప్రభుత్వంపై ప్రభావం చూపించదు. అయితే ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది.


Similar News