Orange Alert: ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్.. సర్కార్ కీలక నిర్ణయం

ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో.. విమానాల్లో ప్రయాణించే వారికి ట్రావెల్ అడ్వైజరీ కీలక సూచనలు చేసింది. కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చునని, ప్రయాణికులు గమనించాలని పేర్కొంది.

Update: 2024-11-18 03:54 GMT

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. పొగమంచు, కాలుష్యం కలవడంతో కనుచూపమేరలో ఏ వాహనం ఉందో, ఏ మనిషి ఉన్నాడో కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ సీజన్లో తొలిసారి ఢిల్లీలో గాలి నాణ్యత (Delhi AQI) 481కి చేరిందని ప్రకటించింది వాతావరణశాఖ. ఆదివారం సాయంత్రం 457గా ఉన్న గాలినాణ్యత సూచీ.. సోమవారం ఉదయానికి సుమారు 30 పాయింట్ల మేర పెరిగింది. దట్టమైన పొగమంచు, కాలుష్యం కలవడంతో.. ఆరెంజ్ అలర్ట్ (Orange Alert) జారీ చేసింది.

ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీ కావడంతో.. విమానాల్లో ప్రయాణించే వారికి ట్రావెల్ అడ్వైజరీ కీలక సూచనలు చేసింది. కొన్ని విమానాలు ఆలస్యం కావచ్చునని, ప్రయాణికులు గమనించాలని పేర్కొంది. మరోవైపు ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రాఫ్ -4 ను అమలు చేస్తున్నట్లు సీఎం అతిషి ప్రకటించారు. 10, 12 క్లాసుల విద్యార్థులకు మాత్రమే ఆఫ్ లైన్ తరగతులు నిర్వహించాలని, 1-9 తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే BS-IV లేదా అంతకంటే తక్కువ వాహనాలు, హెవీ గూడ్స్ వెహికల్స్ పై నిషేధం విధించారు. అత్యవసర సేవా వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంది. 



 


Tags:    

Similar News