కంగనాకు హ్యాండిచ్చిన బాయ్‌ఫ్రెండ్.. ఇన్‌స్టాలో విలపిస్తున్న ఫైర్ బ్రాండ్?

దిశ, సినిమా: సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధంలేని విషయాలపై కూడా స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. బీ టౌన్ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ ఫైర్ బ్రాండ్ ఇటీవల తన ఇన్‌స్టా ‌స్టోరీస్‌‌లో షేర్ చేసిన పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన ఒంటరితనాన్ని కవిత రూపంలో వివరించిన తీరు ఆలోచింపజేస్తోంది. ‘నీ కోసమే నేను జీవించా. కానీ నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు’ అనే కోట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. […]

Update: 2021-11-29 06:49 GMT

దిశ, సినిమా: సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధంలేని విషయాలపై కూడా స్పందించే బాలీవుడ్ నటి కంగనా రనౌత్. బీ టౌన్ సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ఈ ఫైర్ బ్రాండ్ ఇటీవల తన ఇన్‌స్టా ‌స్టోరీస్‌‌లో షేర్ చేసిన పోస్ట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. తన ఒంటరితనాన్ని కవిత రూపంలో వివరించిన తీరు ఆలోచింపజేస్తోంది. ‘నీ కోసమే నేను జీవించా. కానీ నువ్వు అన్యాయంగా ప్రవర్తించావు’ అనే కోట్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

ఈ పొయెట్రీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండగా.. బహుషా ఆమె లవ్ లైఫ్‌కు బ్రేకులు పడ్డాయేమోనని బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో కంగనా ప్రేమ విఫలమైందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే ఈ పోస్ట్‌కు కొన్నిరోజుల ముందే ఓ ప్రముఖ చానెల్‌లో ఇంటర్వ్యూ సందర్భంగా ‘నాకు తల్లి కావాలని ఉంది. ప్రస్తుతం నేను రిలేషన్‌లో ఉన్నాను. ఆయనను అతి త్వరలో మీ అందరికి పరిచయం చేస్తాను’ అని కంగనా పేర్కొనడం గమనార్హం.

Tags:    

Similar News