షార్ట్ ఫిల్మ్స్‌లో రాణిస్తోన్న కామారెడ్డి చిన్నారి
దిశ, కామారెడ్డి : అందం, అభినయం ఆ అమ్మాయి సొంతం.. ఎలాంటి పాత్ర అయినా అందులో ఒదిగిపోయి నటనతో మెప్పించే టాలెంట్ ఆమెది. తండ్రి పరిచయాల ద్వారా షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన వడ్ల రాజులు, రాధికల కూతురు స్మైలి సిరి. కామారెడ్డి పట్టణంలోని ఆర్కిడ్స్ పాఠశాలలో 8 వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు నటన కూడా నేర్చుకోవాలనుకుంది. తండ్రి రాజు ఐకేపీ సంస్థలో రాజంపేట మండల […]
దిశ, కామారెడ్డి : అందం, అభినయం ఆ అమ్మాయి సొంతం.. ఎలాంటి పాత్ర అయినా అందులో ఒదిగిపోయి నటనతో మెప్పించే టాలెంట్ ఆమెది. తండ్రి పరిచయాల ద్వారా షార్ట్ ఫిల్మ్‌లో నటించే అవకాశం దక్కించుకుంది. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లికి చెందిన వడ్ల రాజులు, రాధికల కూతురు స్మైలి సిరి. కామారెడ్డి పట్టణంలోని ఆర్కిడ్స్ పాఠశాలలో 8 వ తరగతి చదువుతోంది. చదువుతో పాటు నటన కూడా నేర్చుకోవాలనుకుంది. తండ్రి రాజు ఐకేపీ సంస్థలో రాజంపేట మండల సీసీగా పని చేస్తున్నాడు. మై ఫిల్మ్ బజ్ యూట్యూబ్ ఛానల్ స్థాపించి లఘు చిత్రాలు రూపొందిస్తున్న
అదే మండలంలోని గుండారం గ్రామానికి చెందిన పుట్ట చంద్రశేఖర్ రాజుకు పరిచయమయ్యాడు. తన కూతురికి నటన నేర్చుకోవాలని ఉందని చెప్పగా అవకాశం కల్పించాడు చంద్రశేఖర్.
చంద్రశేఖర్ డైరెక్షన్ ల్లో ఏడాది క్రితం ప్రేమ పరిణయం చిత్రం ద్వారా లఘు చిత్రాల్లోకి ప్రవేశించింది స్మైల్ సిరి. అది అంతగా ఫోకస్ కాలేదు. రెండవ చిత్రం ‘ఈ జన్మకు సాగిపోనిలా’ చిత్రం బాగా కుదిరింది. ఈ లఘు చిత్రం చంద్రశేఖర్ నిర్మించిన వాటిలో 100 వ చిత్రం కూడా. అరుణ్ నాని, స్మైలి సిరి జంటగా నటించిన ఈ చిత్రాన్ని నేడు విడుదల చేయనున్న సందర్భంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని టీఎన్జీవోస్ భవనంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చిత్ర పోస్టర్ తో పాటు ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లాలో చిత్రాలు నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. అద్భుతమైన నటన ఉన్న యువత కామారెడ్డిలో ఉన్నారని, ఈ లఘు చిత్రాల ద్వారా నిరూపితం అవుతుందని తెలిపారు. సమజానికి మంచి సందేశాన్నిచే మరిన్ని చిత్రాలు రూపొందించాలని ఆయన చిత్ర బృందానికి సూచించారు. తనకు లఘు చిత్రాల్లో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ చంద్రశేఖర్‌కు స్మైలి సిరి కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ సహధ్యక్షులు, నాగరాజు, కోశాధికారి దేవరాజు, సెర్ఫ్ అధ్యక్షుడు రాజిరెడ్డి, దోమకొండ యూనిట్ సహాయ కార్యదర్శి సాయిలు, శ్రీనివాస్, రాజులు, చిత్ర యూనిట్, సిబ్బంది పాల్గొన్నారు.