సిరి దృష్టిలో అమెరికా ప్రెసిడెంట్ ఎవరంటే..

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్లలో ఇంటరాక్టివ్ వర్చువల్ అసిస్టెంట్స్‌తో ఆడుకోవడమంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా ఆపిల్ ఫోన్లలోని సిరితో అయితే అమెరికన్ యూజర్లు విపరీతంగా ఆడుతారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికన్ యూజర్లు సిరిని కొత్తగా ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రశ్నకు సిరి చెబుతున్న సమాధానం ఇప్పుడు కొత్త అంశాలకు తెరతీస్తోంది. ‘హే.. సిరి, అమెరికా అధ్యక్షుడి వయసు ఎంత?’ అని అడిగితే.. కమలా హారిస్ 56 ఏళ్ల క్రితం 1964, […]

Update: 2020-11-11 01:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్లలో ఇంటరాక్టివ్ వర్చువల్ అసిస్టెంట్స్‌తో ఆడుకోవడమంటే అందరికీ ఇష్టం. ముఖ్యంగా ఆపిల్ ఫోన్లలోని సిరితో అయితే అమెరికన్ యూజర్లు విపరీతంగా ఆడుతారు. ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికన్ యూజర్లు సిరిని కొత్తగా ఒక ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రశ్నకు సిరి చెబుతున్న సమాధానం ఇప్పుడు కొత్త అంశాలకు తెరతీస్తోంది. ‘హే.. సిరి, అమెరికా అధ్యక్షుడి వయసు ఎంత?’ అని అడిగితే.. కమలా హారిస్ 56 ఏళ్ల క్రితం 1964, అక్టోబర్ 20న జన్మించారు’ అని సమాధానం చెబుతోంది. షాకయ్యారు కదా.. దాదాపు అమెరికన్లు అందరూ ఇలాగే షాకయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు గానీ, ఇప్పటికే కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పేరు గానీ చెప్పకుండా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమల హారిస్ పేరు చెప్పడం నిజంగా గందరగోళాన్ని సృష్టిస్తోంది. మరి ఇది కావాలని ప్రోగ్రామ్ చేశారా? లేదా ఏదైనా అల్గారిథం తప్పిదమా? అని తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News