సీఎం బిగ్ బాస్ చూడటం హ్యాపీ : కమల్
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, హీరో అండ్ పొలిటిషియన్ కమల్ హాసన్ మధ్య వార్ వైరల్ అయింది. కమల్ ఎంజీఆర్ పేరును ఉపయోగించడాన్ని ఖండించిన సీఎం.. అది కేవలం ఏఐఏడీఎంకే వారసత్వమని, ఆయన పేరును ఉపయోగించే అర్హత ఆ పార్టీకి మాత్రమే ఉందన్నారు. అయినా కమల్ సినిమాల నుంచి రిటైరైన తర్వాత పార్టీని ప్రారంభించారని.. అతనికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల వయస్సులో బిగ్ బాస్ అనే రియాలిటీ షో హోస్ట్ చేస్తున్న […]
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, హీరో అండ్ పొలిటిషియన్ కమల్ హాసన్ మధ్య వార్ వైరల్ అయింది. కమల్ ఎంజీఆర్ పేరును ఉపయోగించడాన్ని ఖండించిన సీఎం.. అది కేవలం ఏఐఏడీఎంకే వారసత్వమని, ఆయన పేరును ఉపయోగించే అర్హత ఆ పార్టీకి మాత్రమే ఉందన్నారు. అయినా కమల్ సినిమాల నుంచి రిటైరైన తర్వాత పార్టీని ప్రారంభించారని.. అతనికి ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. 70 ఏళ్ల వయస్సులో బిగ్ బాస్ అనే రియాలిటీ షో హోస్ట్ చేస్తున్న కమల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? ఏమీ జరగదు కదా అన్నట్లు మాట్లాడారు. పిల్లలు మాత్రమే కాదు కుటుంబాలు కూడా కమల్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో చూసి చెడిపోతున్నాయన్నారు.
దీనిపై స్పందించిన కమల్ భలే కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా తను హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో చూస్తున్నాడని తెలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. కాగా కమల్.. ఎప్పటికీ హోస్టింగ్ ఆపే ప్రయత్నం చేయనని, ఇది తనను నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ చేస్తుందని చాలా సందర్భాల్లో చెప్పారు.