మోడీ మీరు చేసేది తప్పేమో … ఆలోచించండి : కమల్

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు లోకనాయకుడు కమల్ హాసన్. దేశం గురించి దిగులు పడుతున్న పౌరుడిగా బాధ్యతగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. డీమానిటైజేషన్ గురించి మీరు ప్రకటించినప్పుడు నేను మిమ్మల్ని నమ్మి తప్పు చేశానని కాలం తెలిపింది. అదే కాలం మీరు కూడా తప్పని రుజువు చేసిందన్నారు కానీ కోవిడ్ 19 విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లోనూ 1.4 బిలియన్ల భారత ప్రజలతో పాటు మీరు కూడా మీరు చెప్పిన విధానాలనే […]

Update: 2020-04-06 05:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు లోకనాయకుడు కమల్ హాసన్. దేశం గురించి దిగులు పడుతున్న పౌరుడిగా బాధ్యతగా ఈ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. డీమానిటైజేషన్ గురించి మీరు ప్రకటించినప్పుడు నేను మిమ్మల్ని నమ్మి తప్పు చేశానని కాలం తెలిపింది. అదే కాలం మీరు కూడా తప్పని రుజువు చేసిందన్నారు

కానీ కోవిడ్ 19 విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లోనూ 1.4 బిలియన్ల భారత ప్రజలతో పాటు మీరు కూడా మీరు చెప్పిన విధానాలనే అనుసరిస్తున్నారు. ఏ ఇతర నాయకుడికి లేని మాస్ ఫాలోయింగ్ మీకుంది. మీరు ఏది చెప్పినా జనం మీ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే జనతా కర్ఫ్యూ రోజున మీరు చెప్పినట్లుగానే.. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న డాక్టర్లు, పోలీసులను చప్పట్లు కొట్టి అభినందించారు. ఏప్రిల్ 5న కూడా మీ పిలుపుకు ప్రాధాన్యతనిస్తూ రాత్రి తొమ్మిది గంటలకు దీపాలు వెలిగించారు. కానీ మీరిచ్చిన పిలుపు కేవలం బాల్కనీస్ ఉన్న ధనవంతులకు గొప్పగా ఉండొచ్చేమో కానీ… కనీసం నీడలేని పేదలకు ఎలా ఉంటుందో ఆలోచించాలని కోరారు. దీపాలు వెలిగించాలన్న మీ పిలుపుతో నూనె పోసి దియాలు వెలిగించి సంతోషించిన ధనవంతులున్నట్లే… ఒక రోటీ కాల్చుకునేందుకు నూనె దొరకని దుస్థితిలో పేదవారు ఉన్నారని గుర్తించాలన్నారు. మీ గవర్నమెంట్ కేవలం బాల్కనీస్ ఉన్న ప్రజలకే ప్రాధాన్యత ఇస్తుందని నేను అనుకోవడం లేదని… బాల్కనీలు లేని నిరుపేదల గురించి ఆలోచించే సర్కార్ అనుకుంటున్నానని తెలిపారు.

అయితే ఈ పరిస్థితుల్లో నన్ను ఒక్క విషయం అధికంగా భయాందోళనకు గురిచేస్తుందన్నారు కమల్ హాసన్. మోడీ తీసుకున్న డీమానిటైజేషన్ నిర్ణయం పొదుపు, జీవనోపాధిని దెబ్బతీస్తే… లాక్ డౌన్ నిర్ణయం జీవితం, జీవనోపాధిని దెబ్బతీస్తుందని భయపడుతున్నానని తెలిపారు. మీరు కేవలం ధనవంతుల గురించే ఆలోచిస్తున్నారని… ఆల్ రెడీ నిర్మించబడిన మిడిల్ క్లాస్ కోటలను కాపాడేందుకు ట్రై చేస్తున్నారన్న కమల్… పేదలను ఎవరు పట్టించుకుంటారని ప్రశ్నించారు. దేశంలో ఎవరు కూడా ఆకలితో నిద్రపోకూడదనేదే నా ఆలోచన అని.. మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తే బాగుంటుందని కోరారు. అసలు విషయాలు పట్టించుకోకుండా మీరిచ్చే సందేశాలు మిమ్మల్ని ఓ గొప్ప వ్యక్తిగా చూపించవచ్చేమో కానీ.. పేద ప్రజలపై దుష్ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న పరిస్థితుల్లో చట్టం, శాంతి భద్రతలు ప్రాధాన్యమని… కానీ కొన్ని ఏరియాల్లో మీ సిస్టెమ్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఈ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు కమల్.

Tags: Kamal Haasan, Modi, Narendra Modi, Corona Pandemic, Corona, Covid 19

Tags:    

Similar News