Allu Arjun: అల్లు అర్జున్ చెప్పేదానిలో నిజం లేదు.. అతను చేసిన 10 తప్పులు ఇవే అంటూ ఫైర్ అయిన ఓ నెటిజన్
ప్రస్తుతం, ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్: అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన పుష్ప 2 మూవీ విడుదల టైంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మరణించడం, ఓ బాబు కోమాలోకి వెళ్లడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుని శనివారం అసెంబ్లీలో కూడా దీని గురించి సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినీ ఇండస్ట్రీపై మండిపడ్డారు. అయితే, దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. కానీ, ఇతను చెప్పే మాటల్లో నిజం లేదని నెటిజన్స్ నుంచి సామాన్య ప్రజల వరకు విమర్శలు చేస్తున్నారు. ఓ నెటిజన్ అయితే అల్లు అర్జున్ చేసిన తప్పులు ఇవే అంటూ కామెంట్ రూపంలో పెట్టారు. ప్రస్తుతం, ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ మితి మీరిన అహంకారం తో చేసిన తప్పులు.
1. పర్మిషన్ లేకుండా మూవీ కి వెళ్లడం.
2. వెళ్ళేడేదో సైలెంట్ గా వెళ్లకుండా ఒక ర్యాలీని తలపించేలా చెయ్యి ఊపుకుంటూ వెళ్లడం.
3. పోలీస్ వాళ్ళు పరిస్థితి ఇలా ఉందని చెప్పినా .. నేను సినిమా అయ్యాక వెళ్ళాలి అని చెప్పడం.
4. సినిమా నుండి వెళ్లినప్పుడు విషయం తెలిసి కూడా కనీసం బాధ లేకుండా మళ్ళీ ర్యాలీ ని తలపించేలా చేతులు ఊపుతూ వెళ్లిపోవడం.
5. జరిగిన సంఘటన తెలిసిన దాని గురించి స్పందించకపోవడం.
6. రెండు రోజుల తరువాత ఒక వీడియో రిలీజ్ చేసి సంతాపం తెలియచేస్తూ క్షమాపణ చెప్పకపోవడం.
7. సంతాప వీడియోలో తన తప్పు లేనట్టు నిజాలను వక్రీకరించడం. వీడియో చివరిలో సినిమా చూడండి అని ప్రమోషన్ చేసుకోవడం.
8. అరెస్ట్ సమయంలో బాధపడాల్సిన సమయంలో కూడా హుందాగా నవ్వడం.
9. సంధ్య థియేటర్ సంఘటనకి తన అరెస్ట్ కి 9 రోజులు ఉంది కాని సమయం దొరకలేదు సార్ గారికి వారిని పరామర్శించడానికి.
10. ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఈ అల్లు అర్జున్ కు ఐకాన్ స్టార్ అని పిలవడం సబబు కాదు. నిజాన్ని నిర్భయంగా చెప్పే ధైర్యం లేదు. ఐకాన్ స్టార్ అని చెప్పుకునే అర్హత లేదు.
Also Read: తొక్కిసలాట ప్రేరేపితం కాదు.. అల్లు అర్జున్ అరెస్ట్‌పై పురందేశ్వరి సంచలన వ్యాఖ్యలు..