మా అభివృద్దికి భయపడే.. వాళ్లు పోటీ చేయలేదు: కల్వకుంట్ల కవిత

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా శుక్రవారం నామినేషన్ల విత్ డ్రా రోజు కావడం, ఇప్పటికే రెండు నామినేషన్లు దాఖలు కాగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో కల్వకుంట్ల కవిత ఎన్నిక 24న ఖాయమైన విషయం తెల్సిందే. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి […]

Update: 2021-11-26 06:02 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా శుక్రవారం నామినేషన్ల విత్ డ్రా రోజు కావడం, ఇప్పటికే రెండు నామినేషన్లు దాఖలు కాగా స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో కల్వకుంట్ల కవిత ఎన్నిక 24న ఖాయమైన విషయం తెల్సిందే.

షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నారాయణరెడ్డి కల్వకుంట్ల కవితకు ఎన్నికైన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర శాసనసభ్యులు గణేష్ గుప్తా, గంప గోవర్ధన్, హనుమంత్ షిండే, జీవన్ రెడ్డి, రెండు జిల్లాల జిల్లా పరిషత్ చైర్మన్ లు విఠల్ రావు, దఫేదర్ శోభా, నగర మేయర్ నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

మళ్లీ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

మరోసారి తనను శాసనమండలికి పంపినందుకు సంతోషంగా ఉంది. టీఆర్ఎస్ ఉమ్మడి నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు, ప్రజలకు కృతజ్ఞతలు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు కూడా పోటీ చేయకపోవడం వల్ల ఏకగ్రీవంగా గెలుపునకు అవకాశాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ లో మరోసారి పని చేసేందుకు సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్ధే ముఖ్యం, అదే ధోరణిలో ముందుకు సాగుతాం. ఎన్నికలలో నా గెలుపునకు పాటుపడిన ఉమ్మడి జిల్లా శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News