బీర్కూర్‌లో జోరుగా కల్తీ కల్లు.. చర్యలు తీసుకోవాలని డిమాండ్

దిశ, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కల్తీకల్లు జోరుగా కొనసాగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీర్కూర్ మండలం బైరా‌పూర్ గ్రామంలో అనుమతి లేకుండా మూడు కల్లు డిపోలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ కల్లు డిపో గుడికి సమీపంలో, మరో కల్లు డిపో అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో, మరో కల్లు డిపో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత […]

Update: 2021-12-28 07:53 GMT

దిశ, బాన్సువాడ: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో కల్తీకల్లు జోరుగా కొనసాగుతోంది. పర్యవేక్షించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీర్కూర్ మండలం బైరా‌పూర్ గ్రామంలో అనుమతి లేకుండా మూడు కల్లు డిపోలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓ కల్లు డిపో గుడికి సమీపంలో, మరో కల్లు డిపో అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో, మరో కల్లు డిపో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఎక్సైజ్ సీఐ సంతోష్ రెడ్డి వివరణ కోరడానికి ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కల్తీ కల్లు జోరుగా నిర్వహిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:    

Similar News